ఇదే రోజు.. ఇదే ర‌హ‌దారి.. స‌రిగ్గా సంవ‌త్స‌రం కింద‌ట చిలకలూరిపేట జాతీయ రహదారిపై 

జులై ఒక‌టో తేదీ 2019 రోజు తెల్లవారుజామున  జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులతో కూడిన ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఐదుగురు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లతో మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు.

జులై ఒక‌టో తేదీ 2020 జాతీయ ర‌హ‌దారి అర్ధ‌రాత్రి తిమ్మ‌పురం స‌మీపంలో అదుపుత‌ప్పిన కంటైన‌ర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో ఇద్ద‌రు చికిత్స పొందుతూ మృతి చెందారు. 
యాదృచ్చిక‌మే అయినా  సంవ‌త్స‌రం  త‌ర్వ‌తా అదేతేదీ .. ఇదే రోడ్డు పై  ఇలా మ‌రో ప్ర‌మాదం జ‌ర‌గ‌టం విశేషం. 

అప్ప‌టి వ‌ర‌కు అంద‌మైన స్వ‌ప్నాల‌తో ఊహాలోకంలో విహ‌రించిన వారి ప్రాణాలు గాలిలో పోతున్నాయి. .  భ‌విష్య‌త్తు గురించి క‌ల‌లు క‌న్న క‌లలు మ‌ధ్య‌లోనే తెగిపోయాయి. చిల‌క‌లూరిపేట‌లో ఉన్న జాతీయ‌ర‌హ‌దారి ప్ర‌తిసారి  ర‌క్త‌సిక్త‌మౌతునే ఉంది. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి. చిన్న  మాన‌వ‌త‌ప్పిదాల నుంచి, నిర్ల‌క్ష్య‌పు జ‌బ్బు నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేమా..? 

కళ్లు తెరచి మూసేలోగా చిలకలూరిపేట జాతీయ రహదారిపై సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రమదంలో ఒకరు మరణిస్తే ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై, సమాజంపై కూడా ఉంటుంది. గడిచిన కొన్నిసంవత్సరాల కాలంలో వందలాది మంది మృత్యువాత పడగా, వేలాది క్షతగాత్రులుగా బ్రతుకీడుస్తున్నారు.

ప్రమాదపు రక్తపుచారికలు తడిఆరకముందే మరో చోట మరో రూపంలో సంభవిస్తున్న ప్రమాదాలు జీవితాలను కబలిస్తున్నాయి.
 ఆతివేగం.... జాతీయ రహదారిపై సంబవిస్తున్న అనేక ప్రమాదాలకు అతి వేగం ప్రత్యేక కారణంగా నిలుస్తుంది. మ‌రోవైపు మాన‌వ త‌ప్పిదాలు ప్ర‌మాదాలకు కార‌ణ‌మౌతున్నాయి. జాతీయ ర‌హ‌దారుల‌పై వాహ‌నాలు నిల‌ప‌రాద‌న ప్రాధ‌మిక విష‌యాన్ని విస్మ‌రించటం, సంబంధిత అధికారులు చూసి చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టం ఈ ప్ర‌మాదాల‌కు కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. 
వేగంగా గమ్యస్థలానికి చేరుకోవాలన్న తపనతో ఆత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేగంగా వెళుతున్న వాహనాలు ఆదుపుతప్పటం. ఎదురుగా వస్తున్న వెళుతున్న వాహనాలపై దుసూ కు వెళ్లటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.  . జాతీయ రహదారిని ఆ రు లైన్ల విస్తరణ సందర్బంగా సరైన ప్రమాణాలు, చిహ్నాలు ఏర్పాటు చేయకపోవటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. 

 విశ్రాంతి లేక..... జాతీయ రహదారి వెంబడి వెలిసిన పలు డాబా హోటళ్లలో 24 గంటలు మద్యం సరఫరా జరగటం, దూర ప్రయాణాలు చేసే లారీ డ్రైవర్లు విశ్రాంతి లేకుండా వాహనాలు నడపటం లాంటి ఘటనలు ప్రమాదాలకు మూల కారణాలుగా నిలుస్తున్నాయి. గతంలో దూరప్రాంతాలకు వెళ్లే లారీ డ్రైవర్లు కోసం విశ్రాంతి అవసరమని, ఇందుకోసం చర్యలు చేప ట్టాలని ప్రతి పాదనలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో పాటు జాతీయ రహదారిపై వాహనాలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయటం వలన కూడా ప్రమాదాలు రెట్టింపు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకరుగుతున్న ప్రమాదాల ను దృష్టిలో ఉంచుకౌని డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, వారిలో చైతన్యం కలిగించటానికి అధికారులు నిరంతర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: