TRENDING NOW

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

విద్యార్ధుల జీవితాల్లో ఉపాధ్యాయుల‌కు గొప్ప స్థానం 

సినిమాలు వ‌దిలి పుస్త‌కాలు చ‌ద‌వాలి

చిల‌క‌లూరిపేట‌లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌



 

చిల‌క‌లూరిపేట‌న్యూస్‌: 

ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని.. దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని  రాష్ట్ర  ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.  ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని శ్రీ‌శార‌దా జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శుక్ర‌వారం   నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.O  కార్యక్రమంలో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రోడ్డు మార్గాన  చిల‌క‌లూరిపేట‌కు చేరుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నేరుగా పాఠ‌శాలలోకి ప్ర‌వేశించారు. సందర్భంగా పోలీసులు ఉప ముఖ్యమంత్రికి గౌరవ వందనాన్ని చేయగా దాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోకి నడుచుకుంటూ వెళ్లారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పరు భవిష్యత్తును తీర్చిదిద్దుతారు..



ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కీలకమైందని అన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అందుకు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవని కొందరి రాజకీయ లబ్దికోసం కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  అందుకని పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరమన్నారు.పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి వారు దైవసమానులు అవుతారని,  తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని వివ‌రించారు. విద్యార్థుల ఎదుగుదలకు ఈ పేరెంట్ - టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పరు భవిష్యత్తును తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు.విద్యార్థులు ఉదయించే సూర్యులని.. భవిష్యత్తు మీదేనని డిప్యూటీ సీఎం అన్నారు. జెన్ జీ తరం అనేది చాలా కీలకమన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, అధికారికి వారి భవిష్యత్తుపై ధ్యాస ఉండాలన్నారు. లక్ష మెదళ్లను కదిలించే శక్తి చదువు ఇస్తుందన్నారు. 

పుస్త‌కాల‌ను చ‌ద‌వాలి... 



యూదులు పట్టుమని పది మంది ఉన్నా వెయ్యి మందికున్న శక్తి వారికి ఉంటుందన్నారు. మనం లక్షమంది ఉన్నా పోటీ ప్రపంచంలో నిలవలేమన్నారు. అబ్దుల్ కలాం రామనాథపురం నుంచి వచ్చి మిస్సైల్ మ్యాన్ అయ్యారన్నారు. తమిళ మాధ్యమంలో చదివిన కలాం ఎన్నో విజయాలను సాధించడం ద్వారా చదివే మాధ్యమం ముఖ్యం కాదని నిరూపించారని వివరించారు. మీకు బలం తప్పనిసరిగా ఉండాలన్నారు. మానసిక బలం కోసం పుస్తకాలు చదవాలన్నారు. మార్కులు వస్తాయని చదవొద్దన్నారు. గుంటూరు శేషంద్ర‌శ‌ర్మ క‌వి ర‌చించిన పుస్త‌కం విద్యార్ధుల భావి జీవితానికి అండ‌గా ఉంటుంద‌ని భావించి, దాన్ని పునఃముద్రించిన‌ట్లు వెల్ల‌డించారు. తన పాఠశాల విద్య సమయంలో తమ ఉపాధ్యాయులు చరిత్ర పాఠం చెబితే నా గుండెల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ టీచర్ చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పిన కథనే తనను ఈ స్థాయికి తెచ్చిందన్నారు. ఉపాధ్యాయులు భవిష్యత్తు కోసం విద్యార్థులను తయారు చేయాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభావితం చేస్తారన్నారు. మన జీవితాలను బాగు చేసేవారికి ఎలా విధేయతతో ఉండాలనేది తన తల్లి నుంచి నేర్చుకున్నానని డిప్యూటీ సీఎం వివ‌రించారు. హ‌ర్యానా రాష్ట్రం నుంచి తెలుగు భాష నేర్చుకొని పల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా బాగా మాట్లాడుతున్నార‌ని ప్ర‌శంసించారు.  

సినిమాల‌కు దూరంగా ఉండాలి.. 



పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులు, వినోదం పంచే సినిమాకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు.  సినిమాలు కేవలం వినోదం కోసమే. వాటిని చూసి యువత, విద్యార్థులు చెడిపోవద్దు. ఒక నటుడిగా ఈ మాట నేనే స్వయంగా చెబుతున్నా. మనం ఎప్పుడూ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతగా ఉంటూ వారిని ఆదర్శంగా తీసుకోవాలి" అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.  అబ్దుల్ కాలం వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితంలో మనం కూడా ఏదైనా అయ్యి సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థుల వ్యక్తిత్వం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు.

విద్యార్ధుల‌కు ప్ర‌శంస‌లు.... పాఠ‌శాల‌కు వ‌రాలు.. 



పాఠశాల మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గౌసియాను డిప్యూటీ సీఎం అభినందించారు. చిలకలూరిపేటలో గౌసియా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఆడపిల్లలకు ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు జుబేదా, రిహానలు ఫిజిక్స్ కు సంబంధించిన ఫైర్ అలారమ్, డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి గురించి బాగా వివరించారన్నారు. వారిలోని నిగూఢంగా ఉన్న శక్తిని వెలికి తీస్తే దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అధ్యాపకులకు చెప్పాలన్నారు. ఆడపిల్లలను తీర్చిదిద్దగలిగితే వారిలో అద్భుతమైన శక్తి ఉంటుందనే తెలుస్తుందన్నారు. రెస్పరెటరీ సిస్టం గురించి పదో తరగతి విద్యార్థిని నయోమి బాగా వివరించిందన్నారు. శ్రుతి కుట్లు, అల్లికల గురించి, రత్నకుమార్ ఆర్ట్స్ అండ్ స్కిల్ గురించి బాగా చెప్పారన్నారు. జాతీయ విద్యా విధానంలో విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్య గురించి తాను చాలా ప్రతిపాదనలు చేశామన్నారు.శ్రీ శారద పాఠశాలకు కావాల్సిన మైదానం విషయమై కూడా స్థలం కేటాయింపు కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. లైబ్రరీని సొంతగా మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాంధారి సింగ్ లాంటి కవి హిందీ పుస్తకాలు పంపిస్తామన్నారు. లైబ్రరీ నిండిపోయేన్ని పుస్తకాలతో పాటు బీర్వాలు పంపిస్తామని హామీనిచ్చారు. 25 కంప్యూటర్లు సొంత ఖర్చుతో ఇస్తామన్నారు.

గంజాయిపై ప‌వ‌న్ ఫైర్‌..  

మాదక ద్రవ్యాల వినియోగం అంశంపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. పోలీసులు, తల్లిదండ్రులు మాదకద్రవ్యా బానిసలను గుర్తించి వారిని ఆ మత్తు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలని సూచించారు. పంజాబ్ తో పాటు చాలా రాష్ట్రాల్లో యువత గంజాయి పెద్ద విషయం కాదన్నట్లుగా మాట్లాడడం తనకు భయం కలిగిస్తోందన్నారు. అది మధ్య తరగతి వారి జీవితాల్లోకి వస్తే సమాజం విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తప్పకుండా చర్చించి దాన్ని నిర్మూలించేందుకు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఒక దేశ సంపద కలల ఖనిజాలతో చేసిన యువతని గుర్తు చేసుకున్నారు. ఏం చేసినా కూడా అవి ఏవో ఒక రోజు కనుమరుగై పోతాయన్నారు. పోగొట్టుకోలేని నిజమైన సంపద జ్ఞానం అని అన్నారు. పిల్లలకు స్వయం శక్తి పై నిలబడే ఆలోచన విధానాన్ని అలవరచాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు.

 ప‌వ‌న్‌తో హిట్ సినిమా తీసేవాడిని... ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు

తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు చెప్పారు. తాను రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస‌రావుతో క‌ల‌సి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌సి ప‌వ‌న్‌తో సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని, అందుకు ప‌వ‌న్ కూడా సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని గుర్తు చేశారు. అయితే తాను రాజ‌కీయాల్లో ఆ క‌ల నెర‌వేర‌లేద‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిల‌క‌లూరిపేట‌కు రావ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ మైల‌వ‌ర‌పు కృష్ణ‌తేజ చిల‌క‌లూరిపేట‌కు చెందిన  వ్య‌క్తి అని, వారి తాతాగారి హాయాంలో అనేక వంద‌ల ఎక‌రాల భూమి ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం దానం చేశార‌ని వివ‌రించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుడి భుజంలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరించి, విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. 

కార్య‌క్ర‌మంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్‌, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ పి రంజిత్‌భాష‌, ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ మైల‌వ‌ర‌పు కృష్ణ‌తేజ, జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ హెన్నాక్రిస్టినా  త‌దిత‌రులు పాల్గొన్నారు.

----------------------

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 వేలం వెర్రిగా మారిన‌  పార్టీల్లో చేరిక‌లు 

ఫార్టీ ఫిరాయింపు దారుల‌కు ఎన్నిక‌ల పండుగ 

చిల‌క‌లూరిపేట‌న్యూస్‌: 
ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. అధికార వైఎస్సార్ సీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ-జ‌న‌సేన కూట‌మిల మ‌ధ్య వార్ మొద‌లైంది. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే చిల‌క‌లూరిపేట‌లోనూ పూర్తిగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌లంటే కొంద‌రికి పండుగ‌.  ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కు ఆయా పార్టీల్లో ఉండే కొంత‌మందికి నిత్య‌క‌ళ్యాణం ప‌చ్చ‌తోర‌ణ‌మే. ఫ‌ల‌నా పార్టీ నుంచి ఇంత మంది జాయిన్ అయితే, మ‌రుస‌టి రోజు.. అంత స‌మ‌యం కూడా ఉండ‌టం లేదు. సాయంత్రానికే త‌మ పార్టీలో అంత మంది జాయిన్ కావాల్సిందే. ఇందుకు ఈ నాయ‌కులు ప‌నికివ‌స్తారు. ఇటువంటి  నాయ‌కుల‌కు పార్టీలలో  ప్ర‌త్యేక‌మైన గుర్తింపు కూడా ఉంటుంది. వీరితో పాటు జంప్ జిలానిల‌కు ఎన్నిక‌ల అయిపోయేవ‌ర‌కు పండుగే మ‌రి. 
లెక్క స‌రిపోయిందా...? 
లెక్క స‌రిపోవాలి.. లేదా ప్ర‌త్య‌ర్ధి పార్టీ కంటే ఎక్కువ‌గా ఉంటే మ‌రి మంచిది. కండువాలు క‌ప్పుకొనేవారికి .. అంటే పార్టీలు మారేవారికి ప్ర‌త్యేక స‌దుపాయాలు కూడా ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కు అనామ‌కులుగా ఉన్న వారు నాయ‌కులుగా మారిపోతారు. హామీలు  ఉంటాయి. అయితే గ‌తంలో మాదిరి హామీలు న‌మ్మ‌క‌పోవ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఫ‌లానా పార్టీ నుంచి 20 కుటుంబాలు ప‌త్య‌ర్ధి పార్టీలో చేరార‌ని స‌మాచారం రావ‌టం ఆల‌శ్యం వెంట‌నే లెక్క స‌రిచేసుకోవాల‌న్నఆత్రం ప్ర‌త్య‌ర్ధిలో మొద‌లౌతుంది. అంతే వెంట‌నే ప్ర‌త్య‌ర్ది వారు వెంట‌నే త‌మ పార్టీలో 22 కుటుంబాలు చేరాయ‌ని, త‌మ పార్టీ  కండువాలు  వేసి హ‌మ‌య్య అనుకుంటారు. అయ‌తే ఇలా ఆయా పార్టీల‌లో చేరుతున్న వారిలో కొంత‌మంది  సొంత‌పార్టీ మ‌నుషులే కావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తుంది. రాను ఇదో త‌ర‌హ వేలం వెర్రి ప్ర‌క్రియ‌గా మారిపోవ‌డంతో ఎవ‌రు ఏ పార్టీలో చేరినా, పార్టీలు మారినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవడం మాని వేశారు. అయినా పార్టీని బ‌లోపేతం చేయ‌డం అంటే ఇలానా అని ఆయా పార్టీల సీనియ‌ర్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 
-------------------



chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 బాల సాహిత్య సేవ‌లో కొన‌సాగుతున్న దార్ల‌  బుజ్జిబాబు ప్ర‌స్థానం 

17న  బాలసాహితీ రత్నజాతీయ బాల సాహిత్య పురస్కారం 



బాలల మనసు ఏమీ రాయని తెల్లకాగితం వంటిది” అంటాడు ఓ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త.అటువంటి తెల్ల‌కాగితాలపై మ‌నం ఏది నేర్పిస్తే అలా వారి భావి జీవితాలు తీర్చిదిద్ద‌బ‌డ‌తాయి. చిన్న‌త‌నంలో అమ్మ‌లు, నాన‌మ్మ‌లు  వారికి చక్కని నీతి కథలు కూడా చెబుతూ కొన్ని పద్దతుల ద్వారా వాళ్లకు ఎలా నడుచుకోవాలో నేర్పేవారు. కాని నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చిన్నారుల‌కు క‌థ‌లు దూర‌మ‌య్యాయి. క‌థ‌లు చెప్పేవారు. క‌థ‌లు వినే స‌మ‌యం లేదు. ఈ లోటును తీర్చ‌టానికి చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, బాల‌సాహితీవేత్త డాక్ట‌ర్ దార్ల బుజ్జిబాబు జీవితాన్నే వెచ్చించారు. బాల‌ల‌కు అవ‌స‌ర‌మైన సాహిత్యాన్ని సృష్టిస్తూ,వారిని బాల‌సాహిత్యం వైపు ఆక‌ర్షింప చేస్తూ ఒక ఉద్య‌మం కొన‌సాగిస్తున్నారు. పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క శ‌క్తిని పెంచే విధంగా అనేక కార్య‌క్ర‌మాలు రూపొందించారు. ఒక‌వైపు సిటీ కేబుల్‌లో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే, బాల‌సాహిత్య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నారు.   ఈ నెల 17వ తేదీ  బాలసాహితీ రత్న  'పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం ను నల్గొండలో అందుకోనున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక క‌థ‌నం. 

 బుజ్జిబాబు బాల‌సాహితీ ప్ర‌స్థానం ..

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 

ఎండా కాలం గ‌ట్టేక్కినా...  ప్ర‌స్తుతం తీవ్ర ఎద్ద‌డి త‌లెత్తే ప్ర‌మాదం 

సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయితేనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం 



చిల‌క‌లూరిపేట‌:

ఎండా కాలం ముగిసింది. అడ‌పాద‌డ‌పా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ సంవ‌త్స‌రం  హ‌మ్మ‌య్య ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు తీరాయి.. అనుకున్న త‌రుణంలో కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.  చిల‌క‌లూరిపేట‌కు తాగునీరు అందించే రెండు చెరువుల్లో నీటి నిల్వ‌లు అడ‌గంటాయి. ఉన్న నీటి నిల్వ‌ల‌తో ఇంకా  కొన్ని రోజుల‌కు మాత్ర‌మే ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందే అవ‌కాశం ఉండ‌టంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల్లోనూ, అధికారుల్లోనూ అందోళ‌న మొద‌లైంది. సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల‌యితే తప్పా పేట ప్ర‌జ‌ల తాగునీటి క‌ష్టాలు తీరేలా లేవు. మ‌రోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఈ విష‌యంపై ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి, సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయ్యేలా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.  అధికారులు సైతం జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకువెళ్లారు. అయితే నీటి విడ‌ద‌ల అనేది చిన్న విష‌యం కాదు. ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల కృష్ణ‌జ‌లాల యాజ‌మ‌న్య సంస్థ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. ఈ అవ‌రోధాలు దాటి సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయితే త‌ప్పా   ప్ర‌స్తుత త‌రుణంలో ఒక రోజు ఆల‌శ్యం అయినా తీవ్ర నీటి ఎద్ద‌డి పొంచి ఉంది. 

అడ‌గింటిన నీటి నిల్వ‌లు.. 

పట్టణంలో సుమారు లక్షకు పైగా జనాభతో పాటు రోజుకు వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది ప్రజలు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు..ప్రతి మనిషికి రోజువారి అవసరాల నిమిత్తం 135 లీటర్ల మంచినీరు అవసరమౌతుంది.లక్షకు పైగా జనభా ఉన్న పట్టణంలో రోజుకు ప్రతి మనిషికి కేవలం 75 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.. ప్ర‌స్తుతం రోజుమార్చి రోజు తాగునీటిని పుర‌పాల‌క సంఘం స‌ర‌ఫ‌రా చేస్తుంది.  పెద్దదైన కొత్త చెరువులో 2,690 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉండగా, పాతదైన చిన్న చెరువు 950 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. రెండు మంచినీటి చెరువుల్లోని నీరు అడగంటి డెడ్ స్టోరేజ్లు చేరటంతో పట్టణ ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ‌రో వైపు ఇప్ప‌టికీ ప‌లు కాల‌నీల‌కు పుర‌పాల‌క సంఘం స‌ర‌ఫ‌రా చేసే ట్యాంక‌ర్లే దిక్కు. 

నీటి క‌ష్టాలు అధిగ‌మిస్తాం.. సీహెచ్ గోవింద‌రావు, క‌మిష‌న‌ర్ 



నెల రోజులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని , చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ మంచినీటి స‌మ‌స్య‌పై కెనాల్స్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ సైతం ఈ విష‌యంపై స్పందించి పేట తాగునీటి స‌మ‌స్య‌పై దృష్టి సారించారు. ప్ర‌తి రోజూ నీటి వినియోగం, ల‌భ్య‌త తో చెరువుల‌కు సాగ‌ర్ జ‌లాల విడ‌ద‌ల పై చ‌ర్చిస్తున్నాం. సాగ‌ర్ జ‌లాలు త్వ‌ర‌లోనే విడ‌ద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది  వేస‌విలో ఎండ తీవ్ర‌త‌కు నీరు ఇంకి పోయి ఇటువంటి ప‌రిస్థితి ఎర్ప‌డింది. 

------------------------

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines
Published from Blogger Prime Android App

జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత షేక్ జాన్ సైదా యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన కుటుంబీకులకు పరామర్శించిన పిదప 20 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.సోమవారం రాత్రి యడ్లపాడు మండలం కొండవీడులో సిలిండర్ లీకై ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమైన సంఘటన జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించే కట్టా సురేష్ భార్య రాత్రి 8:30 గంటల సమయంలో వంట చేసేందుకు సమాయత్తం అయింది. లైటర్ ముట్టించే ప్రయత్నం చేయగా,అప్పటికీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి.అప్పటికే ఇంట్లోని టీవీ, మంచాలు, దుస్తులు, గృహోపకరణ వస్తువులతో పాటు ఆధార్, రేషన్, విద్య సంబంధిత సర్టిఫికెట్లు కాలిపోయాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యుగ్నేశ్వర రెడ్డి ,గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బి వి రెడ్డి , భాస్కర్ రెడ్డి , పోతరం బాషా మేస్త్రి, 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు , కొండవీడు సర్పంచ్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు...
chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 .. 


ప‌ల్నాడు జిల్లాలో ఉన్న  ఆరు స‌ర్కిళ్లు,  మూడు కు కుదింపు

ఆదాయ వృద్థి కోసం ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ఇటీవ‌ల‌ తీసుకొచ్చిన సంస్క‌ర్ణ‌లు ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఉన్న కార్యాల‌యాల‌ను  తొల‌గించ‌టం, కొత్త స‌ర్కిల్‌లో క‌ల‌ప‌టం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌తి ప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతోనూ కొన్ని చిక్కులు ఏర్పడడంతో సమూల మార్పుల ద్వారా ఆదాయం పొందాలని దృష్టిపెట్టింది..  రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్‌ టాక్స్‌)లో కొత్త సర్కిల్స్‌ ఏర్పాటయ్యాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 110 సర్కిల్స్‌ ఉండగా వీటిని కొత్త జిల్లాల వారీగా సర్థుబాటు చేసి 109కి కుదించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లు, ట్రేడర్ల కార్యకలాపాలపై నిఘాను సర్కిల్స్‌ వారిగా కొనసాగించనున్నారు. గుంటూరు జిల్లాలో తొమ్మిది, బాపట్ల జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో మూడు  సర్కిల్స్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేసింది. ప‌ల్నాడు జిల్లా ను తీసుకుంటే చిల‌క‌లూరిపేట‌లో ఉన్న వాణిజ్య‌ప‌న్నుల శాఖ కార్యాల‌యాన్ని స‌త్తెన‌ప‌ల్లిలో, మాచర్ల‌లో ఉన్న స‌ర్కిల్‌ను  పిడుగురాళ్ల‌కు, వినుకొండ‌లో ఉన్న స‌ర్కిల్‌ను న‌ర‌స‌రావుపేట‌కు త‌ర‌లించి కార్యాల‌యాల‌ను కుదించారు.  

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ చట్టం తీసుకువచ్చింది. ఈ జీఎస్టీ చట్టంతో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్టీతో ఏర్పడిన రెవెన్యూ లోటు ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆయా రాష్ట్రాల లోటు ఆధారంగా పరిహారమిస్తోం ది. మూడేళ్లపాటు మాత్రమే పరిహారం ఇస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ వరకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది.  గడువు ముగిసిన  నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదా యంపై దృష్టి సారించింది.

చిల‌క‌లూరిపేట ఉన్న స‌ర్కిల్‌ను స‌త్తెన‌ప‌ల్లిలో క‌లిపి చిల‌క‌లూరిపేట వాణిజ్య‌ప‌న్నుల శాఖ కార్యాల‌యం తొల‌గించారు. 

ఏ ప్రాతిప‌దిక‌న కుదింపు జ‌రిగింది...?

ప్ర‌భుత్వం జీఎస్టీ వ‌సూళ్ల‌పైనే దృష్టి పెట్టింది. వ‌స్తువు త‌యారి అయ్యే ప్రాంతం క‌న్నా వ‌స్తు వినియోగం ఉన్న ప్రాంతంలోనే జీఎస్టీ అత్య‌ధిక వ‌సూలు అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.   ఇందులో భాగంగానే ఈ మ‌ర్పులు జ‌రిగాయ‌ని అధికారులు చెబుతున్నారు. స‌ర్కిల్ ప‌రిధిలో 3వేల నుంచి 4వేల వ‌ర‌కు డీల‌ర్లు ఉండ‌టం , జీఎస్‌టీ ఆదాయం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత కార్యాల‌యాల‌తో సంబంధం లేకుండా అన్ని వాణిజ్య ప‌న్నుల‌కు సంబంధించి అన్ని  ర‌కాల  సేవ‌లు ఆన్‌లైన్‌లో కొన‌సాగుతున్నాయి. దీంతో కార్యాల‌యాలు ఎక్క‌డ ఉన్నా న‌ష్టం లేద‌ని అధికారులు వాదిస్తున్నారు. అయితే చిల‌క‌లూరిపేట విష‌యానికి వ‌స్తే గ‌తంలో వ్యాట్ ప‌ద్ద‌తి అమ‌లులో ఉన్న‌ప్పుడు అత్య‌ధిక ఆదాయం వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని, కాని జీఎస్టీ అమ‌లులోకి వ‌చ్చాక ఆ ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు.


-----------------


chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines




చిల‌క‌లూరిపేట‌:

ప్ర‌తి సారి ప్లాస్టిక్ నిషేదం, పాలిథిన్ క‌వ‌ర్లు వాడితే చ‌ర్య‌లు అంటూ అధికారులు స‌మావేశాలు ఏర్పాటు చేసి చెప్ప‌టం, తిరిగి అంతా మామూలుగానే జ‌రిగిపోవ‌టం జ‌రుగుతున్న తంతే.  నియోజ‌క‌వ‌ర్గంలో  ప్రతి మనిషి సగటున నాలుగు కేజీల పాలిథిన్‌ కవర్లు వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది .క్యారీ బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, టీ కప్పులు ఇవ‌న్నీ క‌ల‌సి చిల‌క‌లూరిపేట మున్సిపాలిటి నుంచి వ్య‌ర్ధాల్లో ఐదు శాతానికి మించి ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉంటున్నాయి. 


 పాలిథిన్  వాడకం పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, అది క్యాన్సర్‌ కారణమని తెలిసినా, ప్లాస్టిక్‌ కవర్‌ నిషేధించటం లేదు. ప్రతి ఒక్కరూ కిరాణ, కూరగాయల, వివిధ రకాల కు ప్లాస్టిక్‌ కవర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ప్లాస్టిక్‌ వ్యాపారులు రూ.కోట్ల దందాను కొనసాగిస్తున్నారు. దీన్ని అదుపుచేయాల్సిన అధికారులు  చూసి చూడ కుండా వ‌దిలివేయ‌టంతో ప్లాస్టిక్‌ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

 ప్లాస్టిక్‌ వ్యర్థాలతో జరిగే నష్టాలు ఇవే.. 

ప్లాస్టిక్‌ వినియోగంతో వాతావరణ కాలుష్యంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలవల్ల భూమిని కాపాడే ఓజోన్‌ పొరకు భారీస్ధాయిలో చిల్లు పడుతుంది. దీని వల్ల భూమి పైన ఉన్న జీవరాశులు, మనుషుల్లో శ్వాస, చర్మ, సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. అంతేగాక గరం గరం చాయ్‌.. వేడి వేడి ఇడ్లీ, దోశ, పూరి లాంటివి ప్లాస్టిక్‌ కవర్లలోనే తీసుకొచ్చి తింటాము. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టలను పట్టించుకోరూ. అంతేగాక పర్యావరణానికి కూడా ఇవి హాని కలిగిస్తాయి. వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా ప్లాస్టిక్‌ అడ్డుకుంటుంది. ప్లాస్టిక్‌ను తగలబెట్టడం వల్ల డ్రైయాక్సిన్‌ వాయువు గాలిలో కలిసి క్యాన్సర్‌ కారణమవుతుంది. పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తింటాయి. వాటి మాంసం మనం తినటం వల్ల పలు రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతాయి.



 విస్తృత ప్ర‌చార‌మే మార్గం... 

పాలిథిన్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్  వాడకాన్ని తగ్గించుకుంటేనే మంచిది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని బాధ్యతగా గుర్తించాలి. కవర్లు, కప్పులు, వాటర్‌ బాటిళ్లు బహిరంగా ప్రదేశాల్లో వేయరాదు. ప్రజలు ప్లాస్టిక్‌ నిషేధంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మున్సిప‌ల్ అధికారులు  కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాల వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి.


{getPosts} $re
sults={3} $label={recent} $style={2}