ఎండా కాలం గ‌ట్టేక్కినా...  ప్ర‌స్తుతం తీవ్ర ఎద్ద‌డి త‌లెత్తే ప్ర‌మాదం 

సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయితేనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం 



చిల‌క‌లూరిపేట‌:

ఎండా కాలం ముగిసింది. అడ‌పాద‌డ‌పా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ సంవ‌త్స‌రం  హ‌మ్మ‌య్య ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు తీరాయి.. అనుకున్న త‌రుణంలో కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.  చిల‌క‌లూరిపేట‌కు తాగునీరు అందించే రెండు చెరువుల్లో నీటి నిల్వ‌లు అడ‌గంటాయి. ఉన్న నీటి నిల్వ‌ల‌తో ఇంకా  కొన్ని రోజుల‌కు మాత్ర‌మే ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందే అవ‌కాశం ఉండ‌టంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల్లోనూ, అధికారుల్లోనూ అందోళ‌న మొద‌లైంది. సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల‌యితే తప్పా పేట ప్ర‌జ‌ల తాగునీటి క‌ష్టాలు తీరేలా లేవు. మ‌రోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఈ విష‌యంపై ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి, సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయ్యేలా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.  అధికారులు సైతం జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకువెళ్లారు. అయితే నీటి విడ‌ద‌ల అనేది చిన్న విష‌యం కాదు. ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల కృష్ణ‌జ‌లాల యాజ‌మ‌న్య సంస్థ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. ఈ అవ‌రోధాలు దాటి సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయితే త‌ప్పా   ప్ర‌స్తుత త‌రుణంలో ఒక రోజు ఆల‌శ్యం అయినా తీవ్ర నీటి ఎద్ద‌డి పొంచి ఉంది. 

అడ‌గింటిన నీటి నిల్వ‌లు.. 

పట్టణంలో సుమారు లక్షకు పైగా జనాభతో పాటు రోజుకు వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది ప్రజలు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు..ప్రతి మనిషికి రోజువారి అవసరాల నిమిత్తం 135 లీటర్ల మంచినీరు అవసరమౌతుంది.లక్షకు పైగా జనభా ఉన్న పట్టణంలో రోజుకు ప్రతి మనిషికి కేవలం 75 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.. ప్ర‌స్తుతం రోజుమార్చి రోజు తాగునీటిని పుర‌పాల‌క సంఘం స‌ర‌ఫ‌రా చేస్తుంది.  పెద్దదైన కొత్త చెరువులో 2,690 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉండగా, పాతదైన చిన్న చెరువు 950 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. రెండు మంచినీటి చెరువుల్లోని నీరు అడగంటి డెడ్ స్టోరేజ్లు చేరటంతో పట్టణ ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ‌రో వైపు ఇప్ప‌టికీ ప‌లు కాల‌నీల‌కు పుర‌పాల‌క సంఘం స‌ర‌ఫ‌రా చేసే ట్యాంక‌ర్లే దిక్కు. 

నీటి క‌ష్టాలు అధిగ‌మిస్తాం.. సీహెచ్ గోవింద‌రావు, క‌మిష‌న‌ర్ 



నెల రోజులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని , చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ మంచినీటి స‌మ‌స్య‌పై కెనాల్స్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ సైతం ఈ విష‌యంపై స్పందించి పేట తాగునీటి స‌మ‌స్య‌పై దృష్టి సారించారు. ప్ర‌తి రోజూ నీటి వినియోగం, ల‌భ్య‌త తో చెరువుల‌కు సాగ‌ర్ జ‌లాల విడ‌ద‌ల పై చ‌ర్చిస్తున్నాం. సాగ‌ర్ జ‌లాలు త్వ‌ర‌లోనే విడ‌ద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది  వేస‌విలో ఎండ తీవ్ర‌త‌కు నీరు ఇంకి పోయి ఇటువంటి ప‌రిస్థితి ఎర్ప‌డింది. 

------------------------

Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: