..
పల్నాడు జిల్లాలో ఉన్న ఆరు సర్కిళ్లు, మూడు కు కుదింపు
ఆదాయ వృద్థి కోసం ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలో ఇటీవల తీసుకొచ్చిన సంస్కర్ణలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. ఉన్న కార్యాలయాలను తొలగించటం, కొత్త సర్కిల్‌లో కలపటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతోనూ కొన్ని చిక్కులు ఏర్పడడంతో సమూల మార్పుల ద్వారా ఆదాయం పొందాలని దృష్టిపెట్టింది.. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్ టాక్స్)లో కొత్త సర్కిల్స్ ఏర్పాటయ్యాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 110 సర్కిల్స్ ఉండగా వీటిని కొత్త జిల్లాల వారీగా సర్థుబాటు చేసి 109కి కుదించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లు, ట్రేడర్ల కార్యకలాపాలపై నిఘాను సర్కిల్స్ వారిగా కొనసాగించనున్నారు. గుంటూరు జిల్లాలో తొమ్మిది, బాపట్ల జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో మూడు సర్కిల్స్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేసింది. పల్నాడు జిల్లా ను తీసుకుంటే చిలకలూరిపేటలో ఉన్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయాన్ని సత్తెనపల్లిలో, మాచర్లలో ఉన్న సర్కిల్‌ను పిడుగురాళ్లకు, వినుకొండలో ఉన్న సర్కిల్‌ను నరసరావుపేటకు తరలించి కార్యాలయాలను కుదించారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ చట్టం తీసుకువచ్చింది. ఈ జీఎస్టీ చట్టంతో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్టీతో ఏర్పడిన రెవెన్యూ లోటు ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆయా రాష్ట్రాల లోటు ఆధారంగా పరిహారమిస్తోం ది. మూడేళ్లపాటు మాత్రమే పరిహారం ఇస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ వరకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదా యంపై దృష్టి సారించింది.
చిలకలూరిపేట ఉన్న సర్కిల్‌ను సత్తెనపల్లిలో కలిపి చిలకలూరిపేట వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం తొలగించారు.
ఏ ప్రాతిపదికన కుదింపు జరిగింది...?
ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లపైనే దృష్టి పెట్టింది. వస్తువు తయారి అయ్యే ప్రాంతం కన్నా వస్తు వినియోగం ఉన్న ప్రాంతంలోనే జీఎస్టీ అత్యధిక వసూలు అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ మర్పులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. సర్కిల్ పరిధిలో 3వేల నుంచి 4వేల వరకు డీలర్లు ఉండటం , జీఎస్‌టీ ఆదాయం పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఆన్‌లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్యాలయాలతో సంబంధం లేకుండా అన్ని వాణిజ్య పన్నులకు సంబంధించి అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి. దీంతో కార్యాలయాలు ఎక్కడ ఉన్నా నష్టం లేదని అధికారులు వాదిస్తున్నారు. అయితే చిలకలూరిపేట విషయానికి వస్తే గతంలో వ్యాట్ పద్దతి అమలులో ఉన్నప్పుడు అత్యధిక ఆదాయం వచ్చిన మాట వాస్తవమేనని, కాని జీఎస్టీ అమలులోకి వచ్చాక ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు.
-----------------
.jpg)
Post A Comment:
0 comments: