నవ్యాంధ్ర రాజధానికి ఇదో పర్యటక కేంద్రం. ఆద్భుతమైన కళాఖండాలు, విశిష్టమైన చరిత్ర కలగిన కొండవీడు ప్రస్తుతం రాజధాని ఆభివృద్ధి ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోనే ఉంది. చారిత్రక ప్రాధాన్య‌త‌ కలిగిన ఈ ప్రాంతం చిలకలూరిపేట నియోజవర్గంలోని యడ్లపాడు మండలంలో ఉంది. కొండవీటి కోటలో ప్రాచీన విగ్రహాల శోభ శాతాబ్దాల నాటి కళాసంపద ఆదరణకు నోచుకోవటం లేదు. ఆద్భుత శిల్పకళా చాతుర్యంతో నాటి కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న దేవతామూర్తుల విగ్రహాలను కొందరు స్వార్థపరులు గుప్తనిధుల కోసం ద్వంసం చేసారు.  నాడు ఉలితో ఆద్భుతమైన విగ్రహాలను తయారుచేశారు. నేడు యంత్రాలతో కూడా ఇటువంటి విగ్రహాలను స ష్టించలేని పరిస్థితి. వివిధ సందర్భలలో బయట పడ్డ చెట్టుకొకటి, పుట్టకొకటిగా మిగిలిపోతున్నాయి. జీవకళ ఉట్టిపడే ఈ ఆరుదైన శిల్పకళా సంపదను భావితరాలకుఆందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజధాని ప్రాంతంలో ఉన్న కొండవీటి కోటలో ఆద్భుత కళాఖండాలనూ మ్యూజియం ఏర్పాటు చేస్తే పర్యాటకులకు నాటి చారిత్రక సంపదను కనువిందుచేసే ఆవకాశం ఉంది. 



. కొండవీటి రెడ్డిరాజుల కాలంలో పాంపాలనలో ఎన్నో ఆద్భుత విగ్రహాలు ప్రాణం పోసుకున్నాయి. కొండవీడును ప్రోలయవేమారెడ్డి, ఆనుపోతారెడ్డి. ఆనవేమారెడ్డి, కుమారగిరిరెడ్డి, పెదకోమటివేమారెడ్డిలు పారిపాలించారు. కొండవీటి కొండ ప్రవేశనానికి ప్రధాన ముఖ‌ ద్వారం యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం (పుట్టకోట)లోఉంది. శైవ, వైష్ణవ మతాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తు నాటి రెడ్డి రాజులు ఆనేక దేవతామూర్తుల విగ్రాహాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నెలకొల్పిన ప్రతి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఆలయాలల్లో ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలలో గొప్ప కళాత్మకత దాగి ఉంది. కొండపై ఆరుదేవాలయాలు, కొండ దిగువన కొత్తపాలెం ప్రాంతంలోని లోయల్లో మరో ఆరు దేవాలయాలు కూడా ఉన్నట్లు రెడ్డిరాజుల కాలం నాటి చరిత్ర గ్రంధాల ద్వారా తెలుస్తోంది. రెడ్డిరాజుల పరిపాలనలో శివాలయాలు,వినాయక ,వీరభద్ర, విశ్వనాధ, ఆదిలక్ష్మి, పార్వతి, లక్ష్మీనరసింహస్వామి, మూలంకేశ్వరదుర్గాదేవి తదితర విగ్రహాలను స్థాపించి శైవమతాన్ని ప్రోత్సహించారు.
ఆదే విధంగా వెంకటేశ్వర,రంగనాయక, రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలను స్థాపించి వైష్ణవ సాంప్రాదాయలను స్వాగతించారు. ఈ విధంగా శైవ వైష్ణవ మతాలకు సమాన ప్రాధాన్యతను రెడ్డి రాజులు కల్పించరని స్పష్టమౌతుంది.


ఈ ప్రాంతంలో దుర్గాదేవి, వీరభద్రస్వామి, నాగేంద్రస్వామి ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాలు వందల సంవత్సరాల నాడే బయట పడిని నేటికి చెక్కుచెదరలేదు. వీటిని ఆలనాడు పెద కోమటివేమారెడ్డి నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఒంటిస్థంబంపై ఆదిలక్ష్మి దేవాలయం కట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎన్నో విశిష్ట దేవాలయాలను నిర్మించి, ఇటు ఆధ్మాత్మికంగానూ ఆటు కళాత్మాకంగానూ రెడ్డిరాజులు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.


. కొత్తపాలెంకు మరోపేరు పుట్టకోట. పుట్టలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వివిధ నాగేంద్రస్వామి విగ్రహాలు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోయిన వందల సంవత్సరాల ఆనంతరం రైతులకు, పనులు చేసే క్రమంలో తవ్వకాలు జరిపేక్రమంలో బయట పడ్డాయి. మహిళాసురమర్దిని విగ్రహం రౌద్రానానికి నిదర్శనంగా నిలుస్తోంది. సప్త శిరుస్సులు ఉన్న భారీ నాగేంద్రస్వామి విగ్రహం ఏకశిలతో చెక్కటం విశేషం.వీటితో పాటు ఈ ప్రాంతంలో బయట పడిన సీతారాముల విగ్రహాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నాడు రెడ్డిరాజులు యుద్ధాలకు వెళ్లే సమయంలో కొండదిగువభాగాన్న పాము పుట్టలు ఆధికంగా ఉండటం, దేవాలయాలకు పూజలు నిమిత్తం వెళ్లే సమయంలో పాముల వలన ఇబ్బందులకు గురైతున్న పరిస్థితి ఏర్పడటం, ఆక్కడే నివాసగృ హాలు ఉండటంతో ఆ పుట్టలను మొత్తాన్ని తొలగించివేశారు. దీంతో పుట్టకోట గ్రామం కనుమరుగై కొత్తపాలెం గ్రామంగా ఆవిర్భవించింది. పెదకోమటి వేమారెడ్డి యుద్ధానికి బయలు దేరి ఓడి పోయాడు. వేదపండితులు ,ఆస్థాన జ్యోతిష్కులు వేమారెడ్డి యుద్ధంలో ఓడిపోవటానికి నాగదోషం ఉందని దాని నివారణకు నాగదేవాత ఆలయాలు కట్టించాలనిసూచించారు.  ఆనంతరం రాజ్యాన్ని పరిపాలించిన కుమారగిరి రెడ్డి పుట్టకోటప్రాంతంలో సుమారు 50 కిపైగా నాగదేవతాలయాలను నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అందువల్లే ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో నాగదేవతా విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి. మ్యూజియం ఏర్పాటు చేయాలి... ప్రాచీన చారిత్రక సంపదగా ఉన్న విగ్రహాల పర్యవేక్షణ కరువైంది. గుప్తనిధుల కోసం ఇప్పటికే ఆతి ప్రాచీన విగ్రహాలు ద్వంసమయ్యాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం ఆతి ముఖ్యమైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించిన నేపధ్యంలో కొండవీటికోటలో ఉన్న విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణ బాధ్యత చేపట్టాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు పురావస్తుశాఖ ఆధికారులు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మరెన్ని విలువైన శిల్పసంపద బయటపడే ఆవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: