| వాసకురిస్తే... ఆకాసంలో హరివిల్లు విరిస్తే మాకోసమని' ఆనందించే చిన్నారులపై మహాకవి శ్రీశ్రీ వర్ణించిన చిన్నారుల బావి భవితవ్యం కార్మాగారాలల్లో చిధ్రమవుతుంది. ప్రతి కర్మాగారం బయట మాత్రం తమ కంపెనీలో బాలకార్మికులు లేరు అన్న బోర్డులు దర్శనమిస్తుంటాయి. బాల కార్మికులను బడిబాట పట్టించాలని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
చిలకలూరిపేట సమీపాన ఉన్న గణపవరం, తిమ్మాపురం, యడ్లపాడులో విస్తరించిన చిన్నతరహ, భారీ పరిశ్రమలలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నా అధికారులకు వారి గురించి పట్టదు. బడిబాట, బడిపిలిస్తోంది లాంటి ప్రభుత్వం రూపొందిస్తున్న పలుకార్యక్రమాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. దళారీలదే ముఖ్యపాత్ర... 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యఅమలు చేయాలన్న లక్ష్యం నిర్వీర్యమవుతుంది. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు బడికి వెళ్లే చిన్నారులు పరిశ్రమలలో మగ్గుతున్నారు. వీరికి చట్టం అమలు కాదు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులను ఒప్పించి స్థానిక కంపెనీలో కార్మికులుగా చేర్పించటానికి కొంతమంది మధ్య దళారీలు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఉచిత వసతి సౌకర్యంతోపాటు, అన్నీ వసతులు కల్పిస్తామని నమ్మిస్తారు. ఆర్ధిక ఇబ్బందుల రీత్యా వ్యవసాయ కూలీలు గా ఉన్న పలువురు దళారీల మాటలు నమ్మి కంపెనీలకు తరలిస్తారు. ఇలా తరలించిన దళారీలకు కంపెనీల యాజమాన్యం నుంచి మంచి కమీషనే ముడుతుంది . కంపెనీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వాటర్స్‌లో
వీరిని ఉంచి సమయ పాలనతో సంబంధం లేకుండా పనులు చేయిస్తారని ఆరోపణలు ఉన్నాయి. వీరు కాక దూర ప్రాంతాల నుంచి మూడు షిప్ట్ లకు సరిపడ కార్మికులతో పాటు బాలకార్మికులను తరలిస్తారు. ప్రత్యేకంగా వీరికి బస్సులు, జీపులు, వ్యాసులు, వినీ లారీ, ట్రాక్టర్ల సహయంతో ఉచితంగా ఆయా కంపెనీలకు తరలిస్తారు. కొన్ని సందర్భాలలో బాలకార్మికులు రాత్రి సమయాలలో నిద్రకు ఓర్చుకోలేక ఏన్నో ప్రమాదాలకు గురై మరణించిన, ఆంకవైలక్యం పొందిన సందర్భాలు ఉన్నాయి. బాలకార్మికులకే ప్రాధాన్యత.... స్థానిక పరిశ్రమలలో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత స్థానిక యాజమాన్యానికి తలనొప్పి గా మారింది. ఇందుకోసం వేలాది రూపాయలను అడ్వాన్సుగా చెల్లించి ఒరిస్సా, చెన్నై ఇతర ప్రాంతాల సుంచి తీసుకురావటం కన్నా బాలకార్మికులను వినియోగించటం సరైన పద్దతిగా కొంతమంది యాజమాన్యం భావిస్తున్నారు. దీంతో పాటు వారికి అధిక వేతానాలు చెల్లించవలసి ఉంటుంది. ఇందుకోసం బాలకార్మికులను నేరుగా శిక్షణ ఇప్పించటం వలన డబ్బు, సమయం ఆదా అవుతాయని ఆయా కంపెనీల యాజమాన్యం భావిస్తున్నారు.
కార్మిక శాఖ అధికారులు అప్పుడప్పుడు చేసే అరకొర చేసే దాడులు ఏ మాత్రం ప్రయోజనం చేకూరటం లేదు. నిరక్షరాస్యులు రావటంతో వీరి వయస్సు ధృవీకరణ విషయంలో కొంతమంది వైద్యులు కూడా యజమానుల వైపు మొగ్గుచూపుతున్నారన్న విమర్శ వినబడుతుంది. గతంలో కార్మికశాఖ అధికారులు దాడులు నిర్వహించినా వయస్సు ధృవీకరణ విషయంలోనే బాలకార్మికులను విముక్తి చేయటం కుదరటంలేదు

Post A Comment:
0 comments: