నేటి వార్తలు(07-09)
చిలకలూరిపేట నియోజకవర్గం రాజాపేటలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు పర్యటన
విద్యతోనే సామాజాభివృద్ది ఆధారపడి ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం మండలంలో ని రాజాపేట పరిధిలో రూ. 6 కోట్లతో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న గురుకుల పాఠశాలకు మంత్రులు ప్రత్తిపాటి, గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటికే యడ్లపాడు మండలంలో ఏపీరెసిడెన్సియల్ పాఠశాల నిర్మాణంలో ఉందని తెలిపారు. ఆరునెలల్లోనే గురుకుల పాఠశాలను ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమైన నిరుపేద విద్యార్థులకు గురుకుల పాఠశాల ఓ వరమని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అధిక శాతం బడ్జెట్ ఖర్చు చేస్తుందని, సంవత్సరానికి 25వేల కోట్లను విద్యకు కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. సామాజాన్ని, దేశాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో విద్యనభ్యజిస్తున్నారని వివరించారు.

Post A Comment:
0 comments: