చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో 355 మంది లబ్ధిదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు నూతన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చౌకుదుకాణాల ద్వారా నాణ్యమైన సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి వినూత్నమైన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యున్నత పరిపాలనను అందిస్తున్నారని, చంద్రబాబు అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: