పేట రాజకీయాలు -1
గతం నాస్తి కాదు. అది అనుభవాల ఆస్తి. గతం పునాదులపైనే వర్తమానం ఉంటుంది.నేటి వర్తమాన పరిస్థితులే రేపటికి చరిత్రగా మారిపోతుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలను అంచనా వేసే క్రమంలో గత తాలుకు రాజకీయాలను అంచనా వేయాల్సిందే. నాటి నుంచి నేటి వరకు మారుతున్న ప్రజల తీర్పును నేటి నాయకులు పరిగణలోకి తీసుకోక పోతే మనుగడ కష్టమౌతుంది. ఈ క్రమంలోనే చిలకలూరిపేట నియోజకవర్గం ఆవిర్బావం నుంచి నేటి వరకు జరిగిన జరుగుతున్న పరిణామాలు, చరిత్రను మీ ముందుకు ఆవిష్కరిస్తున్నాం.కొన్ని భాగాలుగా మీకు అందించనున్నాం.
చిలకలూరిపేట నియోజకవర్గం మార్పుకు సంకేతంగా నిలుస్తాంది. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒకవైపు ప్రకాశం జిల్లా మరో వైపు పత్తిపాడు, నరసరావుపేటలు, తాడికొండ నియోజవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. నియోజకవర్గంలో చిలకలూరిపేట మండలం, పట్టణతో పాటు యడ్లపాడు, నాదెండ్ల మండలాల అంతర్పాగంగా ఉన్నాయి. చిలకలూరిపేట-కోల్‌కత్తా 18 నంబర్ జాతీయ రహదారి నియోజవర్గానికి ఇరుపక్కలా వ్యాపించి ఉంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పెద్దగా మార్పులేదు. గతంలో పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ఉన్నవ, తుర్లపాడు, సందిపూడి గ్రామాలను చిలకలూరిపేట నియోజకవర్గంలోని యుద్ధపాడు మండలంలో కలిపారు. నాదెండ్ల మండలంలో 15 పంచాయతీలు, ఐదు శివారు గ్రామాలు, యడ్లపాడు మండలంలో 18 గ్రామపంచాయతీలు, చిలకలూరిపేట మండలంలో 21 గ్రామపంచాయతీలు నియోజకవర్గంలో ఉన్నాయి చిలకలూరిపేట మున్సిపాలిటీలో మొత్తం 34వార్డులు ఉన్నాయి.
ఎన్నికైన ఎమ్మెల్యేలు..
చిలకలూరిపేట నియోజకవర్గంపై స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య అభివృద్ధి ముద్ర స్పష్టంగా ఉంది ఆయన. 1952 నుంచి 1978,1985,1994లలో సోమేపల్లి కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించాడు. 1952లో సీపీఐ పార్టీ తరుపున కరణం రంగారావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్లీకి చెందిన ఓ నాగయ్యపై విజయం సాధించారు.
1967లో కందిమళ్ల బుచ్చయ్య స్వతంత్ర్య అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సూతి వెంకటేశ్వర్లుపై ఏ విజయం సాధించారు. 1978లో సోమేపల్లి సాంబయ్య సమీప ప్రత్యర్టీ జనతా పార్టీకి చెందిన ఓ సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 1983లో టీడీపీ ఆవిర్భావం ఆరంతరం టీడీపీ అభ్యర్థి డాక్టర్ కాజా కష్ణమూర్తి సమీప ప్రత్యర్టీ కాంగ్రెస్ పార్లీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై గెలుపొందారు . అనంతరం 1985లో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం వీస్తూన్నా కాంగ్రెస్ పార్టీ తరుపున సోమపల్లి సాంబయ్య సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన మానం వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1981లో టీడీపీ పార్లీ తరపున పోటీ చేసిన డాక్టర్ కందిమళ్ల జయమ్మ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1994 ఎ న్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్య సమీప ప్రత్యకే టీడీపీకి చెందిన మాలెంపాటి వెంకట నరసింహరావుపై విజయం గెలుపొందారు.
1999 లో కరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది, ప్రస్తుత రాష్ట్రపౌరసరఫరాలశఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీప కాంగ్రెస్ అభ్యరీ సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో సోమేపల్లి సాంబయ్య మరణం తరువాత రాజకీయ ప్రవేశం చేసిన మర్రిరాజశేఖర్‌కు కాంగ్రెస్ పార్టీ టికేట్ కేటాయించాలేదు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పార్ట్ అభిమానుల నిరసనలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మనసు మార్చుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న మర్రిరాజశేఖర్ మద్దతు పలికింది.
అయితే అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోటీలో కొనసాగాయి. దీంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నా అప్పటి సమీప టీడీపీ ప్రత్యర్ది అభ్యర్తి ప్రత్తిపాటి పుల్లారావుపై రాజశేఖర్ విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్రిరాజశేఖర్ పై విజయం సాధించారు. అనంతం కూడా 2014లో వైసీసీ అభ్యర్ది మర్రిరాజశేఖర్‌పై ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు.అనంతరం ఆయనకు మంత్రిపదవి లభించింది.





Post A Comment:
0 comments: