పేట రాజకీయాలు -2
2014 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు నియోజవర్గంలో నమోదు కాని పాలింగ్ శాతం నమోదు కావటం విశేషం. నాటి ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,01,068 కాగా ఇందులో పురుషులు 97.519 మహిళ ఓటర్లు 1,03, 489 మంది ఉన్నారు. మొత్తం పోడైన ఓటు 1,72,816 కాగా ఇందులో పురుషుంచి 84.429. మహిళలవి 88.387. గత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి ని గమనించినప్పుడు 1978లో 70.93, 1983లో 69.01 శాతం, 1985 ఎన్నికల్లో 72.53 శాతం, 1989 ఎన్నికల్లో 68.03.శాతం, 1994 ఎన్నికల్లో 66.45 శాతం, 1999 ఎన్నికల్లో 64.29 శాతం, 2014 ఎన్నికల్లో 73.70 శాతం. 2009 ఎన్నికల్లో 81.89 శాతం పోలింగ్ నమోదైంది. ఆ 2009 ఎన్నికలతో పోల్చి చూస్తే 2014 సార్వత్రిక ఎన్నికల్లో4.09శాతం పెరిగింది.
ఓటర్లచైతన్యం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నది అంత త్వరగా అంచనా వేయలేం. కొత్త ఓటర్ల మనస్త్రతత్వం నాటి సామాజిక,రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. 1978 ఎన్నికల్లో 70.93 శాతం పెరిగిన పోలింగ్ శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది సోమేపల్లి విజయానికి నాంది పలకింది. అప్పట్లో పోలింగ్ శాతం ఆ స్థాయిలో ఉంటే 1983లో టీడీపీ ఆవిర్బావం తరువాత ఓటర్లలో చైతన్యం పెరగాల్సింది పోయి తగ్గింది. ఇదే ఎన్నికల్లో నియోజకవర్గంలో తొలిసారిగా టీడీపీ జండా పాటింది. డాక్టర్ కాజా కృష్ణమూర్తి టీడీపీ తరుపున గెలుపొందారు. 1985లో 72.53 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్దివిజయం సాధించారు. ఇదే క్రమంలో 2009 ఎన్నికల్లో 81.89 పెరిగిన పోలింగ్ సరళి ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటిపుల్లరావు విజయానికి దోహదపడింది. ఇదే క్రమంలో 2014 గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడు లేని విధంగా 85.98 శాతం పోలింగ్ నమోదు కాగా తిరిగి ప్రత్తిపాటి విజయానికే కారణమైంది.


Post A Comment:
0 comments: