చిలకలూరిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య బైపాస్ రోడ్డు. వివాదాలు, వాదనలు, పోలీసులు, హైకోర్టుల స్టేలు, తీర్పులు ఇలా పేట ప్రజలకు చాలా మందికి తెలిసిన విషయమే ఇది. బైపాస్ రోడ్డా, ఆరులైన్ల విస్తరణ ఏది అవసరమన్న విషయంపైనే రెండు వర్గాలుగా మారిన ప్రజలు తమ పోరాటాలు కొనసాగించారు. బైపాస్‌రోడ్డు సర్వే కోసం వచ్చిన సర్వేటీమ్‌ను అప్పట్లో రైతులు అడ్డగించి రాళ్లను సైతం తొలగించి ప్రభుత్వానికి దిక్కార స్వరం వినిపించారు.మరోవైపు ఆరులైన్ల విస్తరణ కోసం వచ్చిన సర్వేటీమ్‌ను మరోవర్గం అడ్డగించి తమ నిరసన తెలిపారు. ఇలా వాదాలు, వివాదాలు బయట కొనసాగుతుండగానే హైకోర్టులో సైతం ఈ వాజ్యాలు కొనసాగాయి. ఎట్టకేలకు ప్రభుత్వం బైపాస్‌వైపు మొగ్గుచూపింది. విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీ ప్రకటన, చిలకలూరిపేట పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు పేటకు బైపాస్ రోడ్డు ఉంటుందని స్పష్టం చేశారు.ఇది జరిగిన తరువాత కూడా ఈ వ్యవహారం నత్తనడక కొనసాగింది. భూసేకరణకు నిధుల కొరత ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారటంతో బైపాస్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఈనాడులో పేట బైపాస్‌కు మార్గం సుగమం అంటూ కథనాన్ని ఇచ్చారు.
జాతీయ రహదారి చెన్నై-కలకత్తా మార్గాన ఉన్న చిలకలూరిపేటలో బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. విజయవాడ వారథి నుంచి చిలకలూరిపేట మండలం తాతపూడి వరకు 81 కిలోమీటర్ల మార్గంలో ఇది మినహా మిగిలిన రహదారి నిర్మాణం పూర్తయింది. జాతీయ రహదారుల సంస్థ దీని నిర్మాణానికి ఆమోదించి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. ఈ మేరకు నరసరావుపేట ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించి పరిహారంపై తుది నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణకు అయ్యే వ్యయంలో 25 శాతం సొమ్ము చెల్లిస్తామని 2015లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు లేఖ రాసింది. దాంతో ఆ సొమ్మును సదరు ఆర్డీవో ఖాతాకు జమ చేయాలని ఆ సంస్థ ప్రాంతీయ పథక సంచాలకులు రహదారులు, భవనాలు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అక్టోబరులో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందుకు అనుగుణంగా నిధులు వెంటనే విడుదల చేయాలనీ లేఖలో పేర్కొన్నారు. భూసేకరణకు 75 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కొన్నాళ్లుగా రైతులతో చర్చలు జరిపిన రెవెన్యూ యంత్రాంగం నిబంధనల మేరకు పరిహారం చెల్లించడానికి సిద్ధం చేసింది. దీంతో ఎవరి పొలం ఎంత విస్తీర్ణం మేరకు బైపాస్ నిర్మాణానికి తీసుకుంటారన్న సమాచారాన్ని రైతువారీగా సేకరించినట్లు తెలిపారు.
ఈ సారి యైనా పేటకు బైపాస్ రోడ్డు పనులు వెంటనే పూర్తిఅవుతాయా ... వేచి చూద్దాం..


Post A Comment:
0 comments: