పథకం ప్రకారం హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రించాలను కున్న యత్నాన్ని రూరల్ పోలీసులు భగ్నం చేశారు. ఏడాది గా ఒక వ్యక్తిపై కక్ష పెట్టుకొని అతన్ని మట్టుపెట్టాలను కున్న పథకం బెడిసికొట్టింది. హత్యజరిగిన నాలుగురోజుల్లోనే కేసును చేధించి ముద్దాలను కటకటాల కు పంపారు.శనివారం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ యూ శోభన్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారు. హత్యకు గురైన అంజినిరాజు ది ప్రకాశం జిల్లా గురిజేపల్లి గ్రామం. గత ఏడాది సెప్టెంబర్ 6వతేదీ గ్రామంలో వరసకు సోదరుడు అయిన నూతలపాటి రామాంజనేయులు భార్య కళ్యాణిని మాయమాటలు చెప్పి ఎత్తుకొనివెళ్లాడు. అనంతరం ఆమె 7వ తేదీ రాత్రి కమ్మవారిపాలెం గ్రామ శివార్లో వదలి వెళ్లాడు .ఈ సంఘటన జరిగినప్పటి నుంచి గ్రామంలో పలువురు తనను హేళన చేస్తున్నారని రామాంజనేయులు, బంధువులు అంజయ్య, కేశవరావులు మధన పడసాగారు. అంజనిరాజును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు ఇందుకుకోసం పొలం అమ్మి డబ్బులు కూడా సేకరించుకోసాగారు. విషయం తెలిసిన అంజనీరాజు ఆగ్రామం నుంచి కుటుంబం సహా చిలకలూరిపేట పట్టణానికి వచ్చేసాడు.
పట్టణంలో హత్య చేయటం కష్టమనివారు భావించారు.ఇందుకోసం తనతో గ్రానెట్‌లో పనిచేసిన సాధుబాబును సహాయం అడిగాడు. ఇందుకు సాధుబాబు చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్సార్‌కాలనీలో నివాసం ఉండే సాధు రమేష్‌వద్దకు తీసుకువెళ్లాడు. హత్యకు రూ. 10లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి రెండు విడుతలుగా రూ. 5లక్షలు తీసుకున్నాడు. దీంతోపాటు తన భార్యను అంజనీరాజు తీసుకువెళ్లి సెప్టెంబర్ 6 వతేదీకి సంవత్సరం అవుతుందని ఈలోగా నే అతనిని హత్యచేయాలని పథకం రచించారు. ఇందుకోసం సాధురమేష్ అంజనీబాబు హత్యకోసం పథకం రచించి ,వైఎస్సార్ కాలనీకి చెందిన జంగా అచ్చయ్య, దార్ల ఏసుదాసుతో వేచిఉన్నారు. ముందే క్వారీ పరిసరాలను గమనించిన సాధురమేష్ అంజనీరాజు రాకకోసం ఎదురుచూస్తూన్న ద్విచ్రకవాహనం వచ్చిన రాజును వాహనం అటకాయించి రాడ్‌లతో కొట్టి గాయపరిచారు. తీవ్రగాయాలతో ఉన్న అంజనీరాజు కదలికలు చూసి బతికి ఉన్నాడని భావించి బండతో కొ్ట్టిచంపారు. అనంతరం ప్రమాదంగా చిత్రికరించే ప్రయత్నం చేశారు. కాని పోలీసుల కదలికలు, విచారణతో ముద్దాయిలు లొంగిపోయారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు ,హత్యకు ఉపయోగించిన రాడ్‌లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన రూరల్ ఎస్ ఐ ఉదయబాబు, సిబ్బందిని సీఐ అభినందించారు.

Post A Comment:
0 comments: