నిస్వార్ధసేవకు ప్రతిరూపంగా చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ నిలుస్తోంది. దేశంలో వివిద రాష్ట్రాలలో విస్తరించిన స్వచ్చంధ సంస్థ ప్రధాన కార్యాలయం చిలకలూరిపేటలో ఉండటం గర్వకారణం. నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాల్లో నూ ఏఎంజీ భాగస్వామ్యం ఉంటుంది. అన్నార్తులకు ఆపన్న హస్తం అందజేస్తూ, కష్టాల్లో ఉన్నవారికి, బాధసర్పగ్రస్తులకు భరోసా అందిస్తున్న ఏఎంజీ అందిస్తున్న సేవలు ఈ సంస్థను దేశంలో ప్రముఖ స్వచ్చంధ సేవా సంస్థగా నిలిపింది. సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ జాన్‌డేవిడ్ సేవాతత్పరతను కొనసాగిస్తూన్న సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతికి కి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పురస్కారం లభించింది.
టీబీ వ్యాధి నివారణకు చేస్తున్న కృషికి గాను సంస్థడైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ మహంతికి సేవా పురస్కారం లభించింది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏఎంజీ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ మహంతికి బంగారు పతకంతో పాటు జ్ఞాపికను బుధవారం అందించి ఘనంగా సన్మానించారు. 69వ టీబీ సీల్స్ సేల్ క్యాంపైన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు ఆవార్డును అందజేశారు. దీంతో పాటు ఏఎంజీ సీఎంవో డాక్టర్ రిలీవేదం కంటి మహంతి, రూడైక్మోన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ జాన్ సులక్షన్, స్టీఫెన్ జ్యోతిరోజర్స్ లకు జ్ఞాపికలను గవర్నర్ అందజేశారు. సమాజానికి మహమ్మారిగా మారిన టీబీ వ్యాధిని పారద్రోలేందుకు ఏఎంజీ సంస్థ గుంటూరు, ప్రకాశం,విశాఖపట్నం జిల్లాలలో గత 50 ఏళ్లుగా ఏఎంజీ సంస్థ చేస్తున్న కృషిని గవర్నర్ కొనియాడారు.
సేవా ప్రస్థానంలో పురస్కారం అందుకున్న ఏఎంజీ డైరెక్టర్ అరుణ్‌కుమార్‌మహంతిని, వారి సిబ్బందిని అభినందనలు తెలియజేద్దామా...
Post A Comment:
0 comments: