ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్‌మీడియా ల కన్నా ఇప్పడు డిజిటల్ మీడియా రాజ్యమేలుతుంది. డిజిటల్ మీడియాలోని సోషల్ మీడియా ఇప్పడు పార్టీల ప్రచారానికి, ప్రత్యర్ధి పార్టీలపై దుమ్మెత్తి పోయటానికి వేదికగా మారింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా టీమ్ విస్త్రతంగా పనిచేసి గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా ను వినియోగించుకోలేక సతికిల పడింది. కాని ప్రస్తుతం ట్రెండ్ మారింది. వైసీసీ అధిష్టానం తీసుకొన్న చర్యల్లో భాగంగా సోషల్ మీడియా పై పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఇందుకు అన్ని శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం, ప్రత్యర్ధి పార్టీపై ఎలా దాడి చేయాలి. స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజలను ఎలా భాగస్వాముల్ని చేయాలి.. అనే అంశాలతో పాటు ఇదే క్రమంలో పార్టీ ప్రచారం కూడా ఇందులో ఇమిడి ఉంది. వైసీసీ సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించి మండలాల స్థాయిలోనే సోషల్‌మీడియా వాలెంటేర్లను నియమించారు.
కాస్తా ఆలశ్యంగానైనా చిలకలూరిపేటలో టీడీపీ సోషల్‌మీడియా టీమ్‌ను బలోపేతం చేయటానికి నిర్ణయం తీసుకున్నారు.గతంలో శిక్షణ పొందిన వారి ఆధ్వర్యంలో బూత్‌స్టాయిలోనే సోషల్‌మీడియా టీమ్ ఏర్పాటు చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. కోట్లాది రూపాయాల అభివృద్ది జరిగినా దాన్ని సరైనా రీతిలో ప్రజలకు చెప్పటంలోనూ, ప్రత్యర్ధి పార్టీ సోషల్‌మీడియాలో చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాడానికి కొంత ఆలశ్యం జరిగినట్లు పార్టీ నాయకులు గుర్తించారు. సోషల్‌మీడియా అనుగుణంగా టీమ్ సిద్దమైంది..నియోజకవర్గ పరిధిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఆధ్వర్యంలో కొనసాగిన అభివృద్దిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చేరవేయటానికి రంగం సిద్దమైంది.
ఇప్పటికే పార్టీలు, వర్గాల వారిగా మారి సోషల్‌మీడియాలో దుమ్మట్టి పోసుకోవటం, వ్యక్తిగత దూషణలు కూడా పెరిగి పోయాయి. సోషల్‌మీడియాకు మన నైతిక విలువలే ఎడిటింగ్. సమన్వయంతో వ్యవహరించటమే లక్షణరేఖ. ఎక్కవమంది హుందా వ్యవహరిస్తుండగా కొంతమంది వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, రాగవిధ్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టింగులు పెట్టడం చేస్తున్నారు. ఇందువల్ల పలువివాదాలకు కారణమౌతున్నాయి. శృతి మించితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న విషయం తెలుసుకోవాలి.


Post A Comment:
0 comments: