చిన్నపాయలా మొదలైన ఈ వెబ్‌సైట్ అనతి కాలంలోనే మీ అందరి ఆదరాభిమానాలతో ప్రవాహంలా మారింది. ఈ పురోగతి వెనక తెరవెనుక ఉండి ఆదరించిన జర్నలిస్టు మిత్రలకు కృతజ్ఞతలు. చాల మంది మిత్రులు అడిగారు.. దీన్ని వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి..? ప్రింట్ మీడియా, ఎలక్టానిక్ మీడియాలో ఎన్నో పేపర్లు, టీవీ ఛానళ్లు ఉండగా దీన్ని ఎవరు చూస్తారు..? నిజమే వీటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ మీడియాలో భాగమైన ఈ వెబ్‌సైట్ ను ఆదరిస్తారా.. కొంత సంశయం.. కాని ముందుకే అడుగువేసా.. చిన్న పెట్టుబడి.. నా శ్రమ. ఇలా మీదగ్గరకు చేర్చాయి. ఈ వెబ్‌సైట్ దేనికి ప్రత్యామ్నయం కాదు..అలా అని వీటికి సారూప్యంలేదు.
అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక .. అంటారు కాళోజి.. అక్షరం బలి కోరుతుంది.. అంటూ హెచ్చరిస్తారు.. మా సినీయర్ జర్నలిస్టులు. వీటి సంగతి అలా ఉంచితే నేను రాసిన ప్రతి అక్షరం అచ్చులో చూసుకోవాలన్న తపనే నన్న జర్నలిస్టుని చేసింది. ఏదో చెప్పాలన్న తపన.. జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నించాలన్న ఆవేదన కూడా ఇందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఈ క్రమంలోనే చాల కాలం అనేక మందికి ఘోస్టు రైటర్‌గా పనిచేసా. గుంటూరులో ప్రముఖ దినపత్రిక ఏదో హోదా ఇచ్చి నాలుగు నెలలు పనిచేయించుకొని, నా కథనాలకు ప్రాధ్యాన్యత ఇచ్చి ప్రచురించి డబ్బులు దగ్గర వచ్చే సరికి చేతులెత్తేసారు. ఇది ప్రారంభం కాదు..ముగింపుకాదు. చాల మంది ఇలాగే వ్యవహరించారు. ఇలా ఒకరి కోసం రాతలు వ్రాసి దగా పడటం కన్నా నేరుగా మీ ముందుకు రావాలని ఆశించే ఈ వెబ్‌సైట్ కు రూపకల్పన చేసా. పిండి కొద్ది రొట్టె అన్నట్లు చిన్నపెట్టుబడికి ఈ మాత్రంలోనే వెబ్‌సైట్ డిజైన్ చేసి ఇచ్చారు.
అసలు విషయానికి వద్దాం..ఇతిహాసపు చీకటి కోణం..అట్టడుగున పడి కాన్పించని...కథలన్నీ కావాలిప్పడు!...దాచేస్తే దాగని సత్యం..అంటారు మహాకవి శ్రీశ్రీ. అటువంటి కథల కోసం, కథనాల కోసం ఈ వెబ్‌సైట్ ప్రారంభించా. ప్రారంభంలో కొంతగాడి తప్పింది. తప్పుడగులు పడ్డాయి. అనుకున్న లక్ష్యానికి చేరువ కావటం లేదన్న విషయం అర్ధమైంది. ఈ తప్పులు సరిదిద్దుకుంటా. ఈ వెబ్‌సైట్‌ను చిలకలూరిపేటకే పరిమితం చేయటానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎవరికివారు మన ఊరిలో ఎం జరుగుతుందన్న ఆసక్తే టాబ్టాయిడ్‌లకు అంకురార్పణ జరిగింది. ఇదే కోణంలోనే దీన్ని చిలకలూరిపేటకే పరిమితం చేశా. ఇది కాక నేను మరోవైబ్‌సైట్‌కు కంటెంట్ రైటర్ పనిచేస్తున్నా..మరోవైపు ఒక మహనీయుడు జీవతచరిత్రను వ్రాస్తున్నా.. నాకున్న పరిధి, సమయంలోనే మన చిలకలూరిపేట ప్రజలతో మమేకమవ్వటానికి , కొన్ని నిజాలు మాట్లాడుకోవటానికి వేదికగా వెబ్‌సైట్ ఉంటుందని భావిస్తున్నా.. ఈ ప్రయాణం నా ఒక్కరి వల్ల అయ్యేది కాదు. నాతో పాటు కలిసి అడుగులు వేయటానికి, మీ సూచనలు, చిలకలూరిపేటకు సంబంధించిన విశేషాలు అందించి ,ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సెలవు.. మరోసారి కలుద్దాం..
మీ
ఎడిటర్
మెయిల్ ఐడి .. chilakaluripetanews@gmail.com



Post A Comment:
0 comments: