బండరాళ్లు వీరి ఉలి కొనలను తాకీ కఠిన మైన శిలలు హొయలొలికించే అజంతా శిల్పాలుగా మారుతాయి. ఆదిదంపతులు శివపార్వతులుగా.సీతారాముల్లా ,చదువుల తల్లి సరస్వతిగా ఒడిగిపోతాయి. సాయినాధునిగా సాక్షాత్కరిస్తాం.దేవుడు చేసిన మనుషులు అనేది ఆరోక్తి. బండరాళ్లను దేవుళ్లుగా మార్చటం ఇక్కడి శిల్పుల విశిష్టత. జన్మతహా ముస్లింలైనా హిందుదేవతా మూర్తుల విగ్రహాలను తీర్చిదిద్దటంలో వీరు నిష్ణాతులు.
చిలకలూరిపేటపట్టణంలోని ఏరుషోత్తపట్నం శిల్ప కళలకు ప్రసిద్ధి. . పూర్వికుల నుంచి వచ్చిన శిల్ప కళనే జీవనాధారంగా చేసుకొని ఇక్కడి శిల్పులు మనుగడ కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు నిర్వహిస్తుంటారు. ఇక్కడి శిల్పులకు పేరు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ ఇస్మాయిల్. అసియా ఖండంలోనే పేరిన్నిక కల శిల్పుల్లో ఒకరిగా రిఫరెన్స్ ఏసియా పుస్తకంలో స్థానం కల్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, మహాబలిపురం లోని పలు విగ్రహాలతో పాటు కర్ణాటకలోని మంజునాధ ఆలయంలోని రంగనాధ స్వామి ఏకశిలవిగ్రహం ఇస్మాయిల్ చెక్కినవే . ఆయన వారసత్వాన్ని ఇప్పటికి ఆయన కుమారులు కొనసాగిస్తున్నారు. శిల్ప కళకు ఆదరణ తగ్గుతున్న నేటి కాలంలో ఎంచుకున్న వృత్తి లాభదాయకంగా లేకపోయినా ఇక్కడి శిల్పులు ఇదే వృత్తిని కొనసాగిస్తుంటారు.. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసిన బుద్ద విగ్రహ ప్రాజెక్టులోనూ ఇక్కడి శిల్పులు కీలక పాత్ర వహించారు.
. రాష్ట్రంలోని పలు దేవాలయాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలకు పురుషోత్తమపట్నం శిల్పులు చెక్కిన విగ్రహాలు తరలివెళూంటాం. ఇక్కడ శిల్ప కళపై సుమారు 100 మంది వరకు ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం శిల్పాలు చెక్కెందుకు ఆవసరమైన రాళ్లను ప్రకాశం జిల్లా గురిజేపల్లి నుంచి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర హస్తకళల శాఖ నుంచి ఎటువంటి ప్రోత్సాహం.ఆర్ధిక సహయం ఆందటం లేదని ఇక్కడి శిల్పులు ఇవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండరాళ్లను ఉచితంగా ప్రభుత్వం ఆందజేసి ప్రోత్సహిస్తే మరింత మంది మంచి శిల్పులు పట్టుకొస్తారని తెలుపుతున్నారు. పురుషోత్తమపట్నం రోడ్డు ఇరువైపులా తాత్కలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకుతున్న వీరు తముకు శిల్పాలు పెట్టుకోవటానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తమతో పాటు తమ కళ ఆంతరించిపోకుండా తరువాత తరాలకు నేర్పిస్తామని చెబుతున్నారు.




Post A Comment:
0 comments: