ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎన్నికలకు ముందు ఆయా రాజకీయపార్టీలు అనుసరించాల్సిన వ్యూహం పైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఆయా రాజకీయపార్టీలు ఓటర్ను పోలింగ్ బూత్‌వరకు తీసుకువెళ్లి తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయించుకోవటం పైనే పోల్ మేనేజ్‌మెంట్ అంటారు. పోల్‌మేనేజ్‌మెంట్ లో అనేక అంశాలు నిమిడికృతమై ఉన్నాయి. ముందుగా తమకు అనుకూలంగా వారిని ఓటర్గా నమెదు చేసుకోవటం, ఆయా ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవటం, తటస్టులుగా ఉన్నవారిని తమ పార్టీవైవు ఆకర్షించుకోనేలా చేసుకోవటం ఇదంతా పోల్‌మేనేజ్‌మెంట్‌లో భాగమే.
గతం కన్నామిన్నగా అన్ని పార్టీలు బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లపై దృష్టి సారించాయి.వైసీసీ, టీడీపీ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలుపు,ఓటమిలను శాసించేదెవరు.. ? అన్న ప్రశ్నకు వలస ఓటర్లే అని సమాధానం చెప్పకతప్పదు. వలస ఓటర్లు అంటే వివిధ ప్రాంతాల నుంచి స్థానికంగా వచ్చి కొంతకాలం ఉన్నవారు,స్థానికంగా ఉండి వేర్వేరు ప్రాంతాలకు వ్యాపార,ఉద్యోగ అవసరాల రిత్యా వలస వెళ్లిన వారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ది సాధించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో పనిచేయాటానికి వచ్చినప్పుడు యాజమాన్యాలు వారిని ఓటరుగా నమోదుచేస్తారు. వీరు వారి సొంత ప్రాంతాలలోనూ, నియోజకవర్గంలోనూ ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరితో పాటు ఇక్కడి నుంచి వివిధ కారణాలతో వలస వెళ్లిన వారికి కూడా వారు ఉండే ప్రాంతాలతో పాటు నియోజకవర్గంలోనూ ఓటు హక్కు కలిగి ఉంటారు. వలస కార్మికుల ఓట్లు సుమారు 10 నుంచి 15వేల వరకు ఉంటే , నియోజకవర్గాన్నికి చెంది వలస వెళ్లిన వారి ఓట్లు కూడా సుమారు 10వేల లోపు ఉండవచ్చని చెబుతున్నారు.
ఓట్ల తొలగింపు ఇలా....
* ఓటర్ల జాబితాలో రెండేసి చోట్ల పేర్లు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించాలి. ఇందుకు సంబంధించి చెక్లిస్ట్ను రూపొందించాలి. అనంతరమే ఆ ఓటరు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటరుగా కొనసాగించి.. మరోచోట ఉన్న అతని ఓటును తొలగించాలి. క్షేత్రస్థాయి తనిఖీలో ఓటరు ఒకచోట నివసించడం లేదని తేలితే అతని నుంచి ఫాం–7ను తీసుకున్న తరువాతే జాబితా నుంచి అతని పేరును తొలగించాలి.
* శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే.. వారు ఎక్కడికి వెళ్లారో సంబంధిత బూత్ స్థాయి అధికారి తెలుసుకోవాలి. వలస వెళ్లిన ఓటరుకు నోటీసు జారీచేయాలి. వలస వెళ్లినట్లు ఫాం–7ను అతని నుంచి తీసుకున్న తరువాతే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలి. ఓటరు ఎక్కడికి వలస వెళ్లారో బూత్స్ స్థాయి అధికారి తెలుసుకోలేని పక్షంలో ఓటర్ల జాబితాలో ఉన్న ఇంటి చిరునామాకు నోటీసు అంటించాలని, ఏడు రోజుల అనంతరం.. ఆ ఓటరు కుటుంబ సభ్యులుంటే వారి వాంగ్మూలం తీసుకోవాలని, కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోతే ఇద్దరు పక్కంటి వారి నుంచి సాక్ష్యం తీసుకున్న తరువాతే జాబితా నుంచి తొలగించాలి.
* సామూహికంగా వలస వెళ్లిన ఓటర్లుంటే, అలాంటి వారు ఎక్కడికి వలస వెళ్లారో తెలియని పక్షంలో స్థానిక దినపత్రికల్లో వారి పేర్లను ప్రచురించాలి. ఏడు రోజుల తరువాత కూడా ఎవ్వరూ స్పందించకపోతే వారి పేర్లను అప్పుడు తొలగించాలి.
* మృతి చెందిన వారి పేర్లను వారి డెత్ సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే జాబితా నుంచి తొలగించాలి. జనన, మరణ రిజిస్టర్ లేదా స్థానిక సంస్థలకు చెందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నుంచి మృతి చెందినట్లు నిర్ధారించుకోవాలి. అలాగే, ఫాం–7 నుంచి ఆయా కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించిన తరువాతే మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలి. అలాగే, అతను మృతి చెందినట్లు స్థానికంగా ఉన్న ఇద్దరు నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి.
* ఓటరు గుర్తింపు కార్డు కలిగిన వారి పేర్లను తొలగించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేరు రెండుచోట్ల ఉంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్న తరువాతే తొలగించాలి. పొరపాటున గుర్తింపు కార్డుగల ఓటరు పేరు తొలగిస్తే తిరిగి అతని పేరు జాబితాలో చేర్చాలి. ఇందుకు సంబంధించిన రికార్డును నిర్విహించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు గల ఓటరు పేరు తొలగించడానికి ముందు పోస్టు ద్వారాగానీ లేదా ఎస్ఎంఎస్, ఇ–మెయిల్ ద్వారా తెలియజేయాలి.
* ఏదేని కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని నిర్ణయిస్తే సంబంధిత అధికారి కార్యాలయంలో ఏడు రోజులపాటు నోటీసు బోర్డులో వారి పేర్లను ఉంచాలి. అలాగే, వారి పేర్లను సీఈఓ వెబ్సైట్లో ఉంచాలి. వీటిపై అభ్యంతరాలను ఆహ్వానించాలి. ఆ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా చూపించాలి. అభ్యంతరం వ్యక్తం కాని పేర్లను తొలగించిన తరువాత మళ్లీ తుది జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయాలి. ఓటర్ల తొలగింపు రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించాలి.
* మృతి చెందిన వారివి తప్ప.. ఏ రకమైన తొలగింపులనైనా నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయి తనిఖీల తరువాతే చేయాలి. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించాలి.
* ఎటువంటి తొలగింపులనైనా తహసీల్దారు స్థాయి అధికారే చేయాలి. అంతకు తక్కువ స్థాయి అధికారి నిర్ణయం తీసుకోరాదు. తొలగింపులపై జిల్లా డిప్యుటీ ఎలక్రోల్ ఆఫీసర్ రెండు శాతం, జిల్లా ఎన్నికల అధికారి ఒక శాతం తనిఖీలను నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వికలాంగులను ఓటరుగా నమోదు చేస్తే వారి వికలాంగ స్థాయి వివరాలను పూర్తిగా సేకరించాలి. పోలింగ్ రోజున కమిషన్ వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
కాని ఈ ప్రకారం జరుగుతుందా.. ? ఇంతటి తతంగం కొనసాగుతుందా.. ? అంటే లేదనే చెప్పాలి.



Post A Comment:
0 comments: