ఈ ఏడాది కూడా నియోజకవర్గంలో పత్తిరైతు నిలువుగా మునిగిపోయాడు. గత ఏడాది గులాబి రంగు పురుగు రైతుల ఆశలపై నీళ్లు చల్లితే ఈ ఏడాది తీవ్రభావం రైతులను కుంగదీసింది. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయి రైతులు మరోసారి నష్టాల బాట పట్టనున్నారు. చిలకలూరిపేట, నాదెండ్ల. యడ్లపాడు మూడు మండలాల్లో రైతులు అధికశాతం సుమారు 52,890 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
సీసీఐపై ఆసక్తి కనపరచని రైతులు ...
ప్రతి ఏడాది రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయటానికి చేయటానికి సీసీఐ కొనుగోలు కేంద్రం నూతన మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసేవారు. గత ఏడాది నవంబర్ 26వ తేదీ సీసీఐ కేంద్రాన్ని ఏర్పటు చేసినా రైతులు నిబంధనలు, బయట మార్కెట్‌లో సీసీఐ ధర లభ్యం కావటంతో ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది త్వరలో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవటానికి వెనుకంజవేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈ ఏడాది సీసీఐ మద్దతు ధర రూ. 5450 ప్రకటించింది. ఇదే బయట వ్యక్తులు రూ. 5300లకు ఇళ్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు.
భయపెట్టే నిబంధనలు..
పత్తి పింజ పోడవు 29.5 సంచి 30.5 ఉండి, తేమశాతం (మైక్రోనైర్) 3.5 నుంచి 4.3గా ఉన్న పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ 5450 లకు కొనుగోలు చేస్తామన్నారు. పింజ పోడవు 27.5 నుంచి 28.5, తేమ శాతం 3.5 నుంచి 4.1 ఉన్న పత్తిని రూ 5450 ధరకు అందిస్తామని తెలుపుతున్నారు.రైతులు వాహనాల ద్వారా తీసుకువస్తే ఆటోకు రూ 100, ట్రాక్టర్ కు రూ 200గలను కొనుగోలు కేంద్రంలో ఉండే వాచ్ మెన్లు గేటు పాస్ కోరుతూ వసూలు చేస్తారు. . యార్డులో పనిచేసే సిబ్బంది ఒక్కోచో బోరానికి తీసుకుంటారు.. ఒక బోరెం కాటా వేస్తే ఐదు రూపాయలు, యార్డుకు ఐదు రూపాయలు, ముఠాకు ఐదు రూపాయలను చెల్లించాల్సి వస్తుంది.
పత్తిలో తేమశాతం అధికంగా ఉందని, గుడ్డెకాయ ఎక్కువగా ఉందని, పత్తి పింజ పాడవు తగ్గిందని తదితర కారాణాలు చూపుతూ ఇందుకు ఒక్కో బోరం నుంచి నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల వరకు లెస్ చేస్తారు. వీటితో పాటు కొనుగోలు కేంద్రానికి వచ్చే ముందు రైతులకు చెందిన అనేక పత్రాలను మార్కెట్ యార్డులో అందించాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. రైతులకు సీసీఐ నేరుగా రైతుల వ్యక్తిగత ఖాతాకు నగదు చెల్లిస్తుంది. బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకుంటే రుణం పేరుతో బ్యాంకలు వాటిని జమచేసుకుంటాయి.
ఈ గోలంతా ఎందుకని రైతులు ఉన్న రేటుకే పత్తిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాడి పత్తిరైతులకు కష్టకాలమే.



Post A Comment:
0 comments: