ఎన్నిక‌ల‌కు ఇంకా కొన్ని నెల‌ల స‌మ‌య‌మే ఉంది. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీకి ఆ పార్టీ జ‌నం మ‌ధ్య‌లో ఉండ‌టానికి ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం అన‌లేం కాని, ఆయా పార్టీల అధిష్టానం నిర్ధేశించిన కార్య‌క్ర‌మాల్లో భాగంనే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు ముమ్మ‌రం అయ్యాయి. టీడీపీ గ్రామ‌ద‌ర్శ‌ని పేరుతో ప్ర‌చార కార్య‌క్ర‌మం కొన‌సాగిస్తుండ‌గా, రావాలిజ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ పేరుతో వైసీపీ ప్ర‌చారం కొన‌సాగిస్తుంది. రెండు పార్టీల‌కు సంబంధించి పోటీ చేసే అభ్య‌ర్ధులు ఖ‌రారు అయ్యిన‌ట్లే. తాను చిల‌క‌లూరిపేట నుంచి పోటీ చేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్ర‌క‌టించి కార్య‌క‌ర్త‌ల సందేహాలుకు ఇటీవ‌ల పులిస్టాఫ్ వేశారు. వైసీసీ సైతం విడ‌ద‌ల ర‌జ‌నిని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌క‌టించ‌టంతో ప్ర‌ధాన పోటీ వీరి మ‌ధ్య‌నే ఉండ‌నున్న‌ట్లు తేలిపోయింది.


చిల‌క‌లూరిపేట నియోజక‌వ‌ర్గ ఓట‌ర్ల నాడిని అంత‌త్వ‌ర‌గా అంచ‌నావేయ‌లేమ‌న్న విష‌యం గ‌త ఎన్నిక‌ల నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాలను బ‌ట్టి తెలుస్తోంది. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంది. దీంతో పాటు స్వ‌త‌హాగా వ్య‌క్తిగతంగా  ప్ర‌త్తిపాటిని అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల బ‌లం, వారు న‌డిచిన తీరు ప్ర‌త్తిపాటిపుల్లారావును రాష్ట్ర మంత్రిగా ఎద‌గ‌టానికి దోహ‌ద‌ప‌డ్డాయి. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌మో, వీర‌స్వ‌ర్గ‌మో అన్న తీరులో టీడీపీ విజ‌యానికి కృషి చేశారు. ఎన్నిక‌ల అనంత‌రం గ‌తంలో క‌న్నా మిన్నాగా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని వంద‌ల కోట్ల‌తో అభివృద్ది చేశారు.

 అయితే కొన్ని స‌మ‌స్య‌లు ప్ర‌త్తిపాటి కి ప్ర‌తిబంధంగా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు. కార్య‌క‌ర్త‌ల్లో కొంత‌మందిలో అసంతృప్తి నెల‌కొనిఉంది. మంత్రి చుట్టూ ఉండే  కొంత‌మందికే అధికారం చేప‌ట్టాక ల‌బ్ది చేకూరింద‌న్న ఆరోప‌ణ‌లు కార్య‌క‌ర్త‌లు చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ సీనియ‌ర్ల‌ను విస్మ‌రించార‌న్న అప‌వాదు వినిపిస్తుంది. మార్కెట్ క‌మిటి ముస్లింల‌కు కేటాయించిన త‌రువాత కూడా నెల‌ల త‌ర‌బ‌డి భ‌ర్తి చేయ‌క‌పోవ‌టంపై కూడా ఆ సామాజిక వ‌ర్గంలో కొంత‌మేర అసంతృప్తి నెల‌కొని ఉంది.  వీటితో స‌హ‌జంగా అధికారంలో ఉండే ప్ర‌భుత్వానికి కొంత‌మేర ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఉంటుంది. ఇది కూడా ప్ర‌త్తిపాటిపుల్లారావుపై ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో పాటు కోట్లాది రూపాయాల అభివృద్ది అని మంత్రి మాత్ర‌మే చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. విస్తృత స్థాయిలో జ‌ర‌గాల్సినంత ప్ర‌చారం జ‌ర‌గ‌టం లేదు. జ‌రిగిన అభివృద్దిని ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవ‌టంలో ప్ర‌త్తిపాటి టీమ్ బ‌ల‌హీనంగా ఉన్నారు.  అయితే పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ, వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌శైలీతోనూ, ప్ర‌తిష్ట‌మైన వ్యూహంతోనూ ప్ర‌త్తిపాటి పుల్లారావు వీటిని అధిగ‌మిస్తార‌ని, విజ‌యం తిరిగి అయ‌న‌కే సొంత‌మౌతుందని  అయ‌న అభిమానులు చెబుతున్నారు.



వైసీసీ విష‌యానికి వ‌స్తే విడ‌ద‌ల ర‌జ‌ని ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉన్నారు.గ‌తం నుంచి పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మ‌ర్రిరాజ‌శేఖ‌ర్‌ను కాద‌ని ఆమెకు టికెట్ కేటాయించారు. ఈ క్ర‌మంలో పార్టీలో కొన్ని రోజ‌లు పాటు అంత‌ర్యుద్దం నెలకొన్నా, అధిష్టానం నేరుగా రంగంలో దిగ‌టంతో ప‌రిస్థితి చ‌క్క‌బ‌డింది. మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ కూడా విడ‌ద‌ల ర‌జ‌ని మ‌ద్దతు ప‌లికి కార్య‌క‌ర్త‌ల‌కు ఆమె విజ‌యానికి పోటీ చేయాల‌ని కోర‌టంతో క‌థ సుఖాంతమైంది.  పార్టీలో చేర‌ల‌నుకున్న అలోచ‌న వ‌చ్చిన వెంట‌నే విడ‌ద‌ల ర‌జ‌ని అనుచ‌రులు, కుటుంబీకులు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గం గురించిన స‌మ‌గ్ర స‌మాచారం సేక‌రించి, ముఖ్య‌నేత‌ల‌తో బేటీలు నిర్వ‌హించారు. అనుహ్యంగా బీసీ కార్డు తెర‌పైకి తెచ్చారు. అనంత‌రం పార్టీ నిర్ధేశించిన రావాలిజ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ప్ర‌జ‌ల్లో కూడా స్పంద‌న క‌నిపిస్తుంద‌ని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను, పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకుంటే విజ‌యం సాధ్య‌మే.దీంతో పాటు ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయే తీరు. వాక్చ‌తుర్యం విడ‌ద‌ల ర‌జ‌నికి ప్ల‌స్‌పాయింట్లే.

 అయితే కొన్ని పొర‌పాట్లు, అనుభ‌వ లేమి ఈమె విజ‌యానికి ప్ర‌తిబంధంగా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావును కాని, లేదా మ‌ర్రిరాజ‌శేఖ‌ర్‌ను కాని నేరుగా క‌లిసి స‌మ‌స్య చెప్పుకొనే అవ‌కాశం ఉంటుంది. ఫోన్‌ద్వారా కూడా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకొనే అవ‌కాశం ఉండేది.  మ‌హిళ కావ‌టం వ‌ల‌న నేరుగా ఆమెతో క‌లిసే వీలులేదు.అలా అని ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా అందుబాటులేక‌పోవ‌టంతో కార్య‌క‌ర్త‌ల‌కు ఇబ్బందిగా మారుతుంద‌ని చెబుతున్నారు. గ‌తంలో పార్టీ కోసం ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు, వారి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌టానికి, క‌ల‌వ‌టానికి అవ‌కాశం ఉండ‌టం లేద‌న్న అరోప‌ణలు ఉన్నాయి.  అధికారంలో మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తిపై పోటీ చేయ‌టానికి అవ‌సర‌మైన వ్యూహ‌ర‌చ‌న‌, పోల్ మేనేజ్‌మెంట్ అవ‌స‌ర‌మౌతుంది. వీటిని అధిగ‌మిస్తేనే విజ‌యం సాధ్య‌మౌతుంది. 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: