చినపాయలా మొదలైన ఏఎంజీ ఇండియా ఇంటర్నేషన్ సంస్థ సేవా ప్రస్థానం నేడు 50 సంవత్సరాల మైలురాయిని అందుకుంది. తమ దైనందిక జీవితంలో, పెరిగిన వేగంలో సగటు మనిషి గురంచి పట్టించుకొనే సమయం ఉండదు. ఎక్కడో ఏదో విపత్తు సంభవిస్తే, ఎవరో ఒకరు ఆకలితో అలమటిస్తే అది వారి ఖర్మ అని వదలివేసి వెళ్లిపోతాం. ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని పేపర్లో చదివితే దాని తాలుకు జ్ఞాపకాన్ని క్షణాల్లో తుడిచివేసుకుంటాం. ఎవరికో జీవిత ఖైదు పడిందంటే వాడి చేసిన పాపానికి పడిన శిక్షణ అనుకొని సర్దుకుపోతాం. గత 50 సంవత్సరాల కిందట మనలాగా ఆ వ్యక్తి ఆలోచించి ఉంటే నేటి ఏఎంజీ సంస్థ ఉండేది కాదు. ఆవతలి వారి ఆకలిని తన ఆకలిగా భావించాడు. వారి బాధను తన బాధగా చేసుకున్నాడు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే, కుటుంబంలో ఒకరికి జీవిత ఖైది పడితే ఆ కుటుంబం పడే వేదనను తనదిగా భావించాడు కాబట్టే డాక్టర్ ఎస్ జాన్‌డేవిడ్ అయ్యగారు ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు అంకురార్పణ చేశారు.
దేవుడి సేవలో ఉండే అనేకులకు సగటు మనిషి కష్టాలు తెలియవు. కాని జాన్‌డేవిడ్ అలా కాదు. మానవ సేవే మాధవ సేవ అని విశ్వసించారు. దేవుడి సేవతో పాటు సగటు మనిషి కష్టాలను, కన్నీళ్లను తుడవటానికి సంకల్పించారు. అది మొదలు అనాధలు, బాధసర్పగ్రస్తులు, పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులు, హెచ్ ఐవీ బాధితులు, వృద్ధులకు అయన దేవుడిగా నిలిచారు. 1968లో స్వర్గీయ జాన్‌డేవిడ్ తో మొదలైన సేవా ప్రస్థానం నేటికి కొనసాగుతుంది.
ఎక్కడైనా ఏదైనా విపత్తు సంభవిస్తే ఆయా ప్రభుత్వాల కన్నా ముందుగా స్పందించే సంస్థ ఏఎంజీ. నిస్వార్ధసేవకు ప్రతిరూపంగా చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ నిలుస్తోంది. దేశంలో వివిద రాష్ట్రాలలో విస్తరించిన స్వచ్చంధ సంస్థ ప్రధాన కార్యాలయం చిలకలూరిపేటలో ఉండటం గర్వకారణం. నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాల్లో నూ ఏఎంజీ భాగస్వామ్యం ఉంటుంది.
అన్నార్తులకు ఆపన్న హస్తం అందజేస్తూ, కష్టాల్లో ఉన్నవారికి, బాధసర్పగ్రస్తులకు భరోసా అందిస్తున్న ఏఎంజీ అందిస్తున్న సేవలు ఈ సంస్థను దేశంలో ప్రముఖ స్వచ్చంధ సేవా సంస్థగా నిలిపింది. సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ జాన్‌డేవిడ్ సేవాతత్పరతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూన్న సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది.
ప్రతి మనిషికి అవసరమైన తిండి, గూడు, విద్య ,ఆరోగ్యం ఇలాంటి ప్రాధమిక అవసరాలను తీర్చి కోట్లాదిమందిలో ఏఎంజీ దేశంలోనే స్వచ్చంధ సంస్థలో ఒకటి గా నిలిచింది. ఈ సంస్థ ప్రస్థానం 50 ఏళ్లుకాదు వెయ్యేళ్లు కొనసాగాలని మనసారా అకాంక్షిద్దాం...సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతికి శుభాకాంక్షలు అందిద్దాం...





Post A Comment:
0 comments: