చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల సందర్బంగా మద్యం దుకాణ యజమానులు మందుబాబులకు షాక్ ఇచ్చారు. క్వాటర్ బాటిల్‌పై ఎమ్మార్పీకి మించి అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నికల సందర్బంగా అవి చేస్తున్నాం. ఇవి చేస్తున్నాం అని ప్రెస్ మీట్ లు పెట్టి ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తలా పాపం తిలా పడికెడు చందాన వ్యవహరిస్తున్నారు. ఇటీవల మద్యం దుకాణ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు ఎన్నికల నిబంధనలను ఎకరవు పెడుతు అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు బయట నుంచి మద్యం నిల్వలు తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న అధికారులు నియోజకవర్గంలో నామినేషన్ల సందర్బంగా ఎరులై పారిన మద్యం గురించి తెలియదా..? ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది.? అంతా నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్న అధికారులు ఎమ్మార్పీ ఉల్లంఘన నిబంధనల కిందకు రాదా..? ఎన్నికల సందర్బంగా 10 లేదా 20 క్వాటర్లు బాటిళ్లు పట్టుకొని బెల్టుషాపులపై చర్యలు తీసుకుంటామని, అక్రమ మద్యం రవాణా ను అడ్డుకుంటున్నామని బీరాలు పలుకుతున్న వారు, నియోజకవర్గంలో ఏరులై పారుతున్న అక్రమ మద్యంపై ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం..

Post A Comment:
0 comments: