చిలకలూరిపేట నియోజకవర్గంలో వలసల ప్రవాహం జోరందుకుంది. టీడీపీ నుంచి వైసీసీ, వైసీసీ నుంచి టీడీపీ కి వేలాది మంది పార్టీ కండువాలు మార్చుకుంటున్నారు. విచిత్రమేమిటంతే ఉదయం ఒక పార్టీలో ప్రచారం చేసిన వ్యక్తులు సాయంత్రం మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలోకి మారుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేల జంప్ జిలానీల బెదడ ప్రాధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఒక్కపుడు పార్టీ మారే సమయంలో పార్టీ సిద్దాంతాలు, నైతిక విలువలు, నాయకుల గుణగణాలు పరిగణలోకి తీసుకొని పార్టీ మారేవారు. కాని ఇప్పటి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏ క్షణం ఏం జరుగుతుందో.. ఏ నేత ఏ పార్టీలో ఉంటారో అన్నది అంతుపట్టకుండా తయారైంది.రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది .. ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల రాజకీయం రసవత్తరంగా మారుతోంది… కొందరు నేతల ఫిరాయింపులతో పార్టీల సామాజికవర్గ లెక్కలు కూడా మారిపోతున్నాయి
పార్టీల్లో జంప్ చేసేందుకు వీరికి భారీగా తాయిలాలు అందుతున్నా ఆరోపణలు ఉన్నాయి. డబ్బు, అధికారంతో ముడిపడిన వర్తమాన రాజకీయాల్లో ప్రయోజనం ఆశించకుండా ఏ రాజకీయ నాయకుడు పార్టీ మారడు. ఇప్పుడు ఎన్నికల సమయంలో భవిష్యత్‌లో అది చేస్తాం.. ఇది చేస్తాం అన్న హామీలకు కాలం చెల్లింది. రేపటి గురించి, అలా ఇచ్చే హామీల గురించి ఇప్పడు నమ్మకాలు లేవు. క్షణాల్లో అయిపోవాలి. అప్పడే కండువాలు కప్పుకోవటం అంటూ కండిషన్లు పెడుతున్నారు. ఇక ఇలా పార్టీలు మారటానికి దోహదం చేసిన మధ్యవర్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది.
ఇటీవల నియోజకవర్గంలో పార్టీ మారిన కొంతమంది పరిస్థితి చూసుకుంటే విచిత్రంగా ఉంటాయి.
అధికార టీడీపీలో ఉన్న ఒక సామాజికవర్గానికి నాయకుడుగా ఉన్న వ్యక్తి వైసీసీలో చేరాడు. మరుసటి రోజే తిరగి టీడీపీ కండువా కప్పుకొన్నాడు.
టీడీపీ నుంచి వైసీసీలోకి చేరిన మాజీ కౌన్సిలర్ రోజుల వ్యవధిలోనే తూచ్ అంటూ టీడీపీ కండువా కప్పుకున్నాడు
ఉదయం నుంచి సాయంత్రం వరకు వైసీసీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన ఓ మహిళా నాయకురాలు అదే రోజు రాత్రి టీడీపీ కండువా కప్పుకుంది.
మొత్తంమీద పేట రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి.


Post A Comment:
0 comments: