పక్క పార్టీల వైపు అసంతృప్తుల చూపులు
నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతం నుంచి అభ్యర్దులపై, అధినాయకులపై ఉన్న కోపాన్ని వెల్లగక్కుతున్నారు. తగిన ప్రాతినిధ్యం కోసం కొందరు... తమ అవసరాల కోసం మరికొందరు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించటానికి వారికి కావల్సిన అవసరాలు తీర్చటానికి ప్రధాన పార్టీలు రెండు కూడా సీనియర్ల ప్రత్యేక టీములను తయారు చేసుకున్నాయంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. ఒక ప్రధాన పార్టీలో ఉన్న నేత తన అనుచరులతో కలిసి పార్టీని వీడటానికి సిద్దమయ్యారట. కాని పార్టీని వీడటానికి పెద్ద డిమాండ్ పెట్టడంతో ప్రత్యర్ధిపార్టీ బేరసారాల్లో మునిగిపోయారు. ఇదే క్రమంలో ప్రత్యర్ధి పార్టీకి చెందిన కీలక నేత ఇక సెలవు అంటూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టడంతో కలకలం చెలరేగింది.
ప్యాకేజీలు సిద్దమయ్యాయా...?
నియోజకవర్గంలో ఉన్న రెండు పార్టీలు పక్క పార్టీ ల్లో ఉన్న కీలక నేతలపై కన్నేశారు. వారి సమాజిక వర్గం, అతను పనిచేసిన సంవత్సరాలు, హోదా , ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేస్తాడు అన్న అంశాలపై ప్యాకేజీలు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే రేట్లు డిసేడ్ చేస్తున్నారు. ఇదంతా అత్యంత గోప్యంగా జరుగుతున్నా పార్టీ ఫిరాయించాలను కొనే వారి నుంచి విషయాలు బయటకు పొక్కటం విశేషం. అవతలి పార్టీ వారు తనుకు ఈ విధంగా గౌరవిస్తామన్నారు.. అంటూ సొంతపార్టీని బ్లాక్‌మెయిల్ చేయటానికి, స్వంతపార్టీలోనే అవసరాలు తీర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Post A Comment:
0 comments: