శత్రుశిబిరంలో చొరబడి శత్రువుల రహాస్యాలను వెల్లడించే నిఘా వ్యవస్థ అతి ప్రాచీనమైంది. ఇందుకు సంబంధించి పురాణగాధలు కూడా ఎన్నో ఉన్నాయి. తన కుటుంబాన్ని మట్టు బెట్టిన కౌరవులను అంతమొందించానికి శకుని ఏ విధంగా శత్రుశేషానికి ఒడిగట్టాడో అందరికి తెలిసిన కథే.
రాజకీయాల్లో ఇటువంటి ఎత్తుగడలు గతం నుంచి ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసి ప్రత్యర్థి పార్టీలో చేర్చి వారి ఆ పార్టీ తాలుకు రహస్యాలు, బలహీనతలు తెలుసుకొవటం జరుగుతున్న తంతే.
పెరుగుతున్న ఎండలతో పాటే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల వేడి పెరగిపోయింది. సమయం తక్కువగా ఉండటంతో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారవ్యూహం పై దృష్టి సారించాయి. ఫలాన పార్టీలో ఇంత మంది చేరారు.. అంటే మరుసటి రోజు ఆదే వార్డు, అదే గ్రామం నుంచి ప్రత్యర్ధి పార్టీ నుంచి కూడా అంతే మంది చేర్చటానికి పార్టీ అధినేతలు పట్టుదలగా ఉంటున్నారు. ఇందుకు అవసరమైన ప్యాకేజీలు కూడా సిద్దమయ్యాయి. పార్టీ మారే వ్యక్తి స్థాయిని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. దీంతో హామీలు సరేసరే. ఇదంతా ఒక ఎతైతే మరోవైపు కోవర్టుల బెడద కూడా పార్టీలను ఇబ్బంది పెడుతుంది.
ప్రతి పార్టీ ప్రత్యర్ధి పార్టీ లో జరిగే విషయాలపై దృష్టి సారిస్తుంది. ఇందుకు అసరమైన సమాచారం అధినేతల పక్కనే ఉన్న కొంతమంది నుంచి వస్తున్నదన్నది నిర్విదాంశం. గత ఎన్నికల్లో నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కొన్ని ఉదాహరణలు కోవర్డుల సమాచారం ఎంతగా దెబ్బతిసిందో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది. గత ఎన్నికల సమయంలో ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసం నాయకులతో బేరసారాలు మొదలు పెట్టింది. మరోసటి రోజు వచ్చి అడిగిన డబ్బులు ఇస్తామని ముఖ్యనాయకులు వెళ్లిపోయారు. ఈ సమాచారం ప్రత్యర్ది పార్టీకి తెలియటం ఆలశ్యం ఆ సమాజిక వర్గానికి చెందిన అన్ని హామీలను నెరవెర్చటానికి అంగీకారం కుదరటంతోపాటు రెట్టింపు డబ్బులు కూడా వారి చేతికి అందాయి. ఈ ఎన్నికల్లో ఇదే వ్యవహారం కొనసాగుతుంది. చీమ చిటుక్కుమన్న ప్రత్యర్ధి పార్టీలకు సమాచారం అందిపోవటంతో ఉలిక్కి పడుతున్నారు. ఎన్నికల వేళ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియక సతమతమౌతున్నారు. అందుకే పార్టీకి చెందిన ముఖ్య సమాచారం, సమీక్షలు కొంతమంది నమ్మకస్తుల మధ్య మాత్రమే కొనసాగిస్తున్నారు. ముఖ్యులను కలిసే సమయంలో ఆ సమాచారం బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఒక పార్టీకి చెందిన అభ్యర్ది అయితే ముఖ్యలను కలవటానికి తెల్లవారుజాము సమయంను ఎంచుకోని గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదంతా కోవర్టుల ప్రభావమే మరి.



Post A Comment:
0 comments: