మొదలైన ప్రలోభాల పర్వం.... మద్యం దుకాణాలలో చర్చలు
ఎన్నికల సందర్భంగా పట్టణంలో నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల్లో ప్రచారం మొదలైనప్పటి మద్యం లేనిదే కార్యకర్తలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ప్రతిపార్టీ అభ్యర్ది తప్పని సరిగ్గా మద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చించి రావటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తేదీ వరకు మందుబాబులకు మద్యం సరఫరా చేయాల్సిన బాధ్యత అభ్యర్థులపై పడింది. సమీకరణాలు, చర్చలు మద్యంతోనే ముడిపుడి ఉండటంతో పట్టణంలోని మద్యం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల బ్రాండు మద్యంస్టాక్ నిల్వలు అయిపోయాయి.
నామిషన్ ప్రక్రియ ముగియటంతో అభ్యర్థులు ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. పగటి సమయంలో ప్రజలు ఇళ్లలో ఉండకపోవటంతో రాత్రి వేళల్లో వారిని కలసి ఓట్లు అభ్యర్థించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన ప్రజలను ప్రలోభపెట్టేందుకు టీడీపీ, వైఎస్సార్‌సీసీ లు సిద్ధమయ్యాయి. తమ పట్టణానికి చెంది వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను ఓటింగ్ కు ముందే రావాలని కోరుతున్నారు. అభ్యర్దులకు మద్యం, మాంసాహారం, సాదా ఖర్చులు పెరిగిపోతున్నాయి. రోజు వీటిని అందించే అభ్యర్థులు ఒక రోజు వీటిని సరఫరా చేయకపోతే ఉన్న కార్యకర్తలు ప్రత్యర్ది పార్టీ అభ్యర్ధిని ఆశ్రయిస్తారోమే నని వారిని భరిస్తున్నారు.
గుర్తుకొస్తున్న బుంధుత్వాలు..
.ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు బంధుత్వాలు, సామాజిక వర్గాలను గుర్తు చేస్తు మరీ మద్దతు పలకాలని కోరుతున్నారు. రాత్రి సమయాలలో ఈ రకమైన రహస్య ప్రచారం ఊపందుకుంది. బాగా పరిచయం ఉన్న ఇళ్లకు తిరిగి వారు గెలుస్తే చేయబోయే పనులను ఏకరువు పెడుతున్నారు.ఎన్నికల్లో దగ్గరుండి ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లజాబితాను దగ్గర ఉంచుకొని తమకు పోలయ్యే ఓట్ల గణంకాలను నమోదు చేసుకుంటున్నారు.


Post A Comment:
0 comments: