చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీల అభ్యర్డులు ప్రచారం ముమ్మరం చేసారు. హ్యటిక్ గెలుపుకోసం టీడీపీ అభ్యర్ది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,
వైసీసీ తరుపున తొలిసారిగా బరిలో దిగిన విడదల రజని,
బీజేపీ తరుపు అన్నం శ్రీనివాసరావు,
కాంగ్రెస్ పార్టీ తరపున మద్దుల రాధాకృష్ణ,
జనసేన తరుపున గాదె నాగేశ్వరరావులు బరిలో ఉన్నారు. వీరితో పాటు నవతరం పార్టీ తరుపున రావు సుబ్రమణ్యంతో పాటు ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.
ఆయా పార్టీల అభ్యర్దుల గెలుపు కోసం అధినాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ తరుపున ఇప్పటికే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరుపున సినినటులు దివ్యవాణి, నందమూరి తారకరత్న, అశోక్‌కుమార్‌లు ప్రచారం నిర్వహించగా త్వరలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పాల్గొన నున్నారు. జనసేన తరుపున పవన్ కళ్యాణ్‌కూడా ప్రచార సభలకు హాజరు కానున్నారు.
ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 12 పర్యాయాలు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ 4 సార్లు, టిడిపి 5 సార్లు, స్వతంత్ర పార్టీ, సిపిఐ, ఇండిపెండెంటు ఒక్కోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టిడిపికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు 10684 ఓట్ల తేడాతో వైసీపీకి చెందిన ఎమ్. రాజశేఖర్‌పై విజయం సాధించారు. ఈ అసెంబ్లీ పరిధిలో చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాలున్నాయి.
బంధువులు, కుటుంబ సభ్యులు ఆయా అభ్యర్దుల గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్తిపాటి పుల్లారావుకోసం ఆయన సతీమణి వెంకటకుమారి, కుమారుడు శరత్, కుమార్తె స్వాతి, వైసీసీ అభ్యర్ది విడదల రజని కోసం ఆమె బంధువులు విడదల స్పూర్తి, విడదల గోపినాధ్, విడదల లక్ష్మినారాయణ, తోట రాము తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీల అభ్యర్దుల కోసం కూడా బంధువులు, మిత్రలు ప్రచారంలో ఉన్నారు.
-






Post A Comment:
0 comments: