హీనంగా చూడకు దేన్ని ...అంటూ మహాకవి శ్రీశ్రీ చెబుతాడు. ఎన్నికల రణరంగంలో చిన్నచిన్న పార్టీలు, బరీలో ఉన్న వ్యక్తులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్దుల గెలుపుఓటమిలను నిర్ధేశించే అవకాశంఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో గతం నుంచి ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమౌతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని సందర్బాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కొణపు పోటీ జరిగింది. మర్రిరాజశేఖర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోవటంతో ఆయన ఇండిపెండింట్‌గానే నామినేషన్ వేశారు. అనంతరం పార్టీ టికెట్ కేటాయించిన మల్లాది శివన్నారాయణను కాదని రాజశేఖర్‌కే మద్దతు ప్రకటించింది. అయినా మర్రిరాజశేఖర్ ఈ ఎన్నికల్లో 212 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వాస్తవంగా బరిలో నుంచి తప్పుకున్నా చివరి నిమిషంలో నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవటంతో మల్లాది శివన్నారాయణ కాంగ్రెస్ అభ్యర్ధిగానే బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ చిహ్నం ఉండటంతో ఆయనకు 7841 ఓట్లు పడ్డాయి. వాస్తవంగా ఈ ఓట్లు కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన రాజశేఖరకు పడాల్సివి. ఈ ఎన్నికల్లో బీఎస్సీ, సమాజ్‌వాది పార్టీతో పాటు మరో ఆరుగురు ఇండిపెండింట్ అభ్యర్దిలు కలసి 1702 ఓట్లు సాధించారు.
2009 ఎన్నికల్లో ఇండిపెండింట్లు చిన్నచన్న చితక పార్టీలు ప్రభావం చూపాయి. వాస్తవంగా టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పి మద్యేపోటీఉంటే వీటితో లోక్‌సత్తా, బీజేపీ, బీఎస్సీ లు కూడా బరిలో నిలిచాయి. ఈ పార్టీలకు 37443 ఓట్లు వచ్చాయి. మొదటి సారిగా పోటీ చేసిన పీఆర్పీ అభ్యర్ధి పోసాని కృష్ణమురళికి ఈ ఎన్నికల్లో 14,201 ఓట్లు లభించాయి. పీఆర్పీ పోటీ అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్ధి మర్రిరాజశేఖర్ అపజయానికి కారణంకాగా టీడీపీ అభ్యర్ధి ప్రత్తిపాటి పుల్లారావు విజయానికి కారణమైంది.
ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ, వైసీసీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలతో పార్టీలతో నవతరం పార్టీ, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఇండింపెంట్లు, చిన్న చిన్న పార్టీలతో జరజాగ్రత్త మరి..



Post A Comment:
0 comments: