ఒటర్ల తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. చిలకలూరిపేటలో కాబోయే ఎమ్మెల్యే ఎవరో తేలటానికి 40 రోజుల సమయం ఎదురు చూడాల్సిందే. పోలింగ్ కోసం పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చినా ఈవీఎంలు వారి సహానానికి పరీక్ష పెట్టాయి. గంటల సమయం క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది. ఎవరికి వ్యతిరేకంగా ఉందన్న విషయంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
నియోజకవర్గం మొత్తంలో 2,23,809 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,07,653 కాగా , మహిళలు 1,16,120 , ఇతరులు 36 మంది ఉన్నారు. పట్టణ పరిధిలో మొత్తం 87,062 ఓట్లు ఉండగా ఇందులో పురుషులు 41, 185 , మహిళలు 45,849, ఇతరులు 28 మంది ఉన్నారు. చిలకలూరిపేట మండలంలో మొత్తం 42,055 ఓట్లు ఉండగా పురుషులు 20,308 , మహిళలు 21,741 మంది ఉన్నారు. నాదెండ్ల మండలంలో మొత్తం ఓట్లు 51,686 ఉండగా ఇందులో పురుషులు 25,352, మహిళలు 26,326 ఇతరులు 8 మంది ఉన్నారు. యడ్లపాడు మండలంలో మొత్తం ఓట్లు 43,006 కాగా పురుషులు 20,808, మహిళలు 22,198 మంది ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 239 పోలింగ్ కేంద్రాలల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు
గత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని గమనించినప్పుడు 1978లో 70.83, 1983లో 69.01 శాతం, 1985 ఎన్నికల్లో 12.53 శాతం, 1989 ఎన్నికల్లో 68.03శాతం, 1994 ఎన్నికల్లో 65.45 శాతం, 1999 ఎన్నికల్లో 64.29 శాతం, | 2004 ఎన్నికల్లో 13.10 శాతం, 2009 ఎన్నికల్లో 81.89 శాతం పోలింగ్ నమోదైంది.. 2014 ఎన్నికల్లో 85.98 పోలింగ్ శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ పోలింగ్ ఇది 84.75 శాతం నమోదైంది. అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం శుక్రవారం ఉదయం అధికారులు తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించారు.
ఒకే ఈ పోలింగ్ శాతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ పార్టీల విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. గత ఎన్నికల కంటే ఒక్క శాతం తగ్గినా ఇది తమ పార్టీకే అనుకూలమని ఇరు పార్టీలకు చెందిన నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. చూద్దాం ఎవరి విశ్వషణలు నిజమౌతాయో...?



Post A Comment:
0 comments: