పోస్టల్ బ్యాలెట్‌తో పేటలో మొదలైన ఓట్ల కొనుగోలు
పోలింగు సమయం దగ్గర పడుతుండటంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ, వైసీసీ అభ్యర్థులు ప్రత్తిపాటి పుల్లారావవు, విడదల రజని నియోజకవర్గం చుట్టేశారు. ప్రతిఓటూ కీలకం కావడంతో ఏమాత్రం అనుమానం ఉన్నా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆఖరి రెండు రోజులు అధికారుల నిఘా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ లోపే పంపకాలు చేపట్టాలని అభ్యర్థులు ప్రణాళిక రచించుకుంటున్నారు. ఇప్పటికే తమకు అనుకూలమైన చోటుకు సొమ్ములు చేరవేసినట్లు సమాచారం.
ముందుగా పోస్టల్ బ్యాలెట్‌తో పంపకాలకు తెరతీసారు. ఓటు రూ. 2వేలకు కొనుగోలు చేసారు. ఒక పార్టీ అయితే వ్యూహత్మకంగా వ్యహరించి ముందుగానే సమావేశాలు నిర్వహించి డబ్బులు మట్టజెప్పగా, మరోపార్టీ కేంద్రం వద్ద పోస్టల్ ఓట్లను కొనుగోలు చేసింది.
:ఈ ఎన్నికలు ప్రధాన రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో గెలవడమే ధ్యేయంగా కొందరు ప్రలోభాలకు తెరతీస్తున్నారు. పంపకాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి ఎంత పంచుతున్నాడో తెలుసుకుని దానికి అదనంగా కొంతచేర్చి ఇవ్వాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో ఇచ్చినా ఓటర్లు అర్థం చేసుకుంటారని ఒక పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారట. మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు ఓ పార్టీ తరఫున వారికి నజరానాలు ముట్టజెపుతున్నారు.
డబ్బు తరలింపు జరగకుండా ఉండడం కోసం ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా పట్టుబడుతున్నది గోరంతే అని అందరికీ తెలిసిన సత్యం. యంత్రాంగం కళ్లుగప్పి ఓటర్లు మెప్పుపొందడం కోసం నానాపాట్లు పడుతున్నారు. దానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని మార్గాల నుంచి నగదును తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల గ్రామాలకు తరలిపోయింది. చివరి రెండు రోజులు అధికారులు, పోలీసుల నిఘా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ లోపే పంపకాలు చేసేయాలని ఆయా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జనాభిమానం లేకుండా కేవలం పంపకాలతోనే విజయం సాధించినట్లు ఎన్నికల చరిత్రలో ఎక్కడా లేదు. అధికులు పంపకాలు చేస్తుండటంతో అందరి వద్ద తీసుకుని ఓటరు తనకు నచ్చిన వారికి ఓటు వేస్తున్నారు. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్‌లతో డబ్బుల పంపకానికి తెరలేచిందనే చెప్పాలి.



Post A Comment:
0 comments: