ఆవును... చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆయా పార్టీల అభ్యర్దుల గెలుపు ఓటముల్లో మహిళలు కీలకంగా మారారు. నియోజకవర్గ పరిధిలో పురుషుల కన్నా అధికంగా ఉన్న మహిళలు ఇప్పుడు గెలుపు,ఓటముల్లో కీలకంగా మిగిలారు. మహిళా ఓటర్ల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి. వారు ఏ పార్టీకి అనుకులంగా ఓట్లు వేసారన్న విషయమే ప్రధాన పార్టీలను వేధిస్తున్న సమస్య.
పేట నియోజకవర్గం మొత్తంలో 2,23,809 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,07,653 కాగా , మహిళలు 1,16,120 , ఇతరులు 36 మంది ఉన్నారు. పట్టణ పరిధిలో మొత్తం 87,062 ఓట్లు ఉండగా ఇందులో పురుషులు 41, 185 , మహిళలు 45,849, ఇతరులు 28 మంది ఉన్నారు. చిలకలూరిపేట మండలంలో మొత్తం 42,055 ఓట్లు ఉండగా పురుషులు 20,308 , మహిళలు 21,741 మంది ఉన్నారు. నాదెండ్ల మండలంలో మొత్తం ఓట్లు 51,686 ఉండగా ఇందులో పురుషులు 25,352, మహిళలు 26,326 ఇతరులు 8 మంది ఉన్నారు. యడ్లపాడు మండలంలో మొత్తం ఓట్లు 43,006 కాగా పురుషులు 20,808, మహిళలు 22,198 మంది ఉన్నారు.
అంటే పురుషుల కన్నా మహిళ ఓటర్ల సంఖ్య 8,647 అధికం. పోలింగ్ సరళిలో కూడా మహిళ ఓటర్లు తమ చైతన్యాన్ని కనపరిచారు. ఉదయం సమయంలో పెద్ద సంఖ్యలో ఓట్లు వేయటానికి తరలివచ్చిన మహిళలు ఈవీఎంల మొరాయింపుతో వెనుతిరిగారు. తిరిగి మధ్యాహ్న సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకొన్న మహిళలు పోలింగ్ రాత్రి అయినా ఓటు వేసే వరకు కదలకుండా ఉన్నారు.దీంతో ఇప్పడు మహిళ ఓట్లు ఎటువైపు పడ్డాయన్న విషయంపై చర్చకొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన పసుపు-కుంకుమ ప్రభావం చూపిందా.. లేదా వైసీపీ మహిళ అభ్యర్ధి కావటంతో ఆమెకు అనుకూలంగా కదలివచ్చారా అన్న ది ..? మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మే 23 వరకు ఆగల్సిందే. అయితే పేట నియోజకవర్గంలో అభ్యర్దుల గెలుపు, ఓటముల్లో వీరు క్రియాశీలకంగా మారటం విశేషం.



Post A Comment:
0 comments: