చిలకలూరిపేట పట్టణంలో శ్రీరామనవమి సందర్బంగా సీతారామకళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దశాబ్దాలుగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో చలవ పందిళ్లు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేయటం ఆచారంగా వస్తుంది. వినాయకచవితి, శ్రీనవమి వేడుకలకు చిలకలూరిపేట పెట్టింది పేరు.
స్ఠానికంగా ఏర్పాటు చేసిన పందిళ్లలో వైభవాన్ని, విద్యుత్ దీపాల అలంకరణలు, స్వామి వార్ల ప్రత్యేక పూజలను తిలకించటానికి వేలాది మంది రాత్రి సమయాన్ని వెచ్చిస్తారు. మూడు రోజుల పాటు పందిళ్లు కొత్త శోభను సంతరించుకుంటాయి.ఇదోక యజ్ఞం. వ్యాపారస్తులు, వివిధ వాణిజ్యవర్గాలకు చెందిన వారు, ప్రజలు స్వచ్చందంగా ఇక్కడ సేవలు అందిస్తుంటారు.


Post A Comment:
0 comments: