సార్వత్రిక ఎన్నికల అంకం ముగిసాక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సర్పంచుల కాల పరిమితి ముగిసింది. మరికొన్ని రోజుల్లో మున్సిపల్ పాలకుల పదవికాలం ముగియనుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణం, యడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలు అంతర్బాగంగా ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోక, ప్రజా ప్రతినిధుల ప్రాతినిద్యంలేకుండా గతంలో సంవత్సరాల తరబడి గడిచింది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగాయి. కాని ఈ సారి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో సహజంగా అధికారంలోకి వచ్చే పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల జాబితా సిద్దం చేశారు.
ప్రజాప్రతినిధుల పాలన కొనసాగినా గ్రామాల్లో గాని, పట్టణంలోని గాని అనుకుంతగా మార్పు కనిపించటం లేదని ప్రజల వాదన. కనీస అవసరాలైన తాగునీటి సమస్య ఇంకా పట్టి పీడిస్తుంది. ఇటు గ్రామాల్లో గాని, .పట్టణంలోని గాని తాగు నీటి విషయంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
వేసవిలో మాట అల ఉంచితే వర్షాకాలంలో సైతం ప్రజలందరికి తాగునీరు అందని పరిస్థితి నెలకొంది. పారిశుధ్యం విషయానికి వస్తే గ్రామాల్లో ఇది అధ్వాన్నంగా తయారైంది. పంచాయతీల ఆధ్వర్యంలో పారిశుద్యనిర్వహణకు నిధులు కేటాయించకపోవటంతో పారిశుధ్యం అటకెక్కింది.వీధి దీపాలు అంతంత మాత్రమే. లక్షకు పైగా జనాభ ఉన్న పట్టణంలోనూ తాగునీటి సమస్యతో పాటు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవన్ని రానున్న ఎన్నికల పై ప్రభావం చూపవచ్చు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మరో ఎన్నికలకు హడావిడి మొదలు కానుంది.
ఈ విషయంపై విడియో కొరకు చూడంది..
https://www.youtube.com/edit?o=U&ar=2&video_id=vxbnRb9FuLo
ఈ విషయంపై విడియో కొరకు చూడంది..
https://www.youtube.com/edit?o=U&ar=2&video_id=vxbnRb9FuLo



Post A Comment:
0 comments: