ఎన్నికలు ముగిసాయి. ఇక ఎన్నికలకు ముందు బదిలీపై వచ్చిన అధికారులు వారు ఇంటిదారి పడుతున్నారు. ఎన్నికల బదిలీపై వచ్చిన అధికారులు వ్యవస్థాగతమైన మార్పులకు, సంస్కర్ణలకు దూరంగా ఉన్నారు. ఇకపై వచ్చే ప్రతి అధికారి తనదైన మార్కు పాలన, సంస్కర్ణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ముందుగా నియోజకవర్గంలో అత్యంత కీలకమైన శాంతిభద్రతల విషయంలో ఇరువురు సీఐలు విధుల్లో చేరారు. అర్బన్‌సీఐగా వి సూర్యనారాయణ, రూరల్ సీఐగా ఎం సుబ్బారావులు బాధ్యతలు స్వీకరించారు.
ఈ అంశాలపై దృష్టి సారిస్తారా...?
ముందుగా చిలకలూరిపేట పట్టణానికి వస్తే ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. పట్టణాభివృద్దితో పాటు విస్తరించని రోడ్లు, పెరిగిన అక్రమణలు, పార్కింగ్ ప్రదేశాలు లేకపోవటం, ప్రజలకు ట్రాఫిక్‌పై సరైన అవగాహన లేకపోవటం తదితర కారణాలతో నానాటికి ట్రాఫిక్ సమస్య ప్రజలను వేధిస్తుంది. అర్బన్ సీఐ వి సూర్యనారాయణ ఈ విషయం ముందుగా దృష్టి కేంద్రిక రించాల్సిన అవసరం ఉంది. పట్టణంలో వన్‌వే ట్రాఫిక్ అమలు చేయటం, భారీ వహనాలను నిర్ణిత సమయంలోనే అనుమతించటం, అక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవటం, పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాలలోనే వాహనాలను నిలుపుదల చేయించటం తదితర చర్యలతో కొంతమేర ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇక క్రికేట్‌బెట్టింగ్, రహస్యంగా కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న వ్యభిచారం, మీటర్ వడ్డీల దందా తదితర అంశాలపై ఉక్కుపాదం మోపాల్సి ఉంది. దీంతో పాటు పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అనుసంధానం గుంటూరులో ఉంది. ఇందువల్ల అవాంచనీయ సంఘటన జరిగినా దాని తాలుకు పుటేజీ కోసం గుంటూరు పై ఆధారపడాల్సి వస్తుంది. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకొని చిలకలూరిపేటలోనే దీనికి సంబంధించిన అపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
ఇక రూరల్ సర్కిల్ పరిధిలో అనేక సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి. జాతీయ రహదారిపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు మండలాల పరిధిలో పొలాల్లో, చింతతోపుల వద్ద కొనసాగుతున్న పేకాటను నియింత్రించాల్సి ఉంది. గ్రామాల్లో ఎన్నికలకు ముందు జరిగిన చిన్నపాటి ఘర్షణలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఇటీవల అమీన్‌సాహెబ్‌పాలెం,యడవల్లి తదితర ప్రాంతాలలో జరిగిన ఘర్షణలకు మూలం ఎన్నికల నాటి వివాదాలే . ఈ కక్షలు పెరిగి పచ్చని గ్రామాలను ముంచెత్తక ముందే పటిష్టమైన నిఘా వ్యవస్థను పెంపోందించుకోవాలి. శాంతి కమిటిలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కోసం కృషి చేయవచ్చు. అక్రమ ఇసుక తవ్వకాలు, యడ్లపాడు మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు నియంత్రించాల్సి ఉంది.
ఫ్రెండ్లీ పోలీస్ సాధ్యమే....
ఇటీవల సీఎం జగన్‌మోహనరెడ్డి పోలిస్ వ్యవస్థలో ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలియజేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రిషప్సనిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఫిర్యాదు దారుల పట్ల మర్యదా పూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యవస్థ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లలో ఉన్నప్పటికి ఇందుకు తగ్గ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే చిలకలూరిపేట నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండదు. ఇక్కడ పనిచేసిన పలువురు పోలీసు అధికారులు స్థానిక ప్రజల మన్ననలు పొందినట్లే ఇద్దరు అధికారులు శాంతిభద్రతలు పరిరక్షించి ప్రజల మన్ననలు పొందుతారని ఆశిద్దాం..



Post A Comment:
0 comments: