అప్పటి వరకు అందమైన స్వప్నాలతో ఊహాలోకంలో విహరించిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భవిష్యత్తు గురించి కలలు కన్న కలలు మధ్యలోనే తెగిపోయాయి. చిలకలూరిపేటలో ఉన్న జాతీయరహదారి మరోసారి రక్తసిక్తమైంది. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి. చిన్న మానవతప్పిదాల నుంచి, నిర్లక్ష్యపు జబ్బు నుంచి బయటపడలేమా..?
చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది
తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులతో కూడిన ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఐదుగురు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లతో మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు
మరి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఆరుగుర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు
వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు
వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బు వారి పాలెం గ్రామానికి చెందిన వారు, ఇరు కుటుంబాల వారు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది.
చనిపోయిన వారు సూర్య భవాని 22 సంవత్సరాలు, వెంకట్ 30 సంవత్సరాలు, గీతేశ్వరి బాబు 4 సంవత్సరాలు, సోనాక్షి 5 సంవత్సరాలు, మనోజ్ 22 సంవత్సరాలు.
కళ్లు తెరచి మూసేలోగా చిలకలూరిపేట జాతీయ రహదారిపై సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రమదంలో ఒకరు మరణిస్తే ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై, సమాజంపై కూడా ఉంటుంది. గడిచిన కొన్నిసంవత్సరాల కాలంలో వందలాది మంది మృత్యువాత పడగా, వేలాది క్షతగాత్రులుగా బ్రతుకీడుస్తున్నారు.
ప్రమాదపు రక్తపుచారికలు తడిఆరకముందే మరో చోట మరో రూపంలో సంభవిస్తున్న ప్రమాదాలు జీవితాలను కబలిస్తున్నాయి. ఆలివేగం.... జాతీయ రహదారిపై సంబవిస్తున్న అనేక ప్రమాదాలకు అతి వేగం ప్రత్యేక కారణంగా నిలుస్తుంది. మరోవైపు మానవ తప్పిదాలు ప్రమాదాలకు కారణమౌతున్నాయి. జాతీయ రహదారులపై వాహనాలు నిలపరాదన ప్రాధమిక విషయాన్ని విస్మరించటం, సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించటం ఈ ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు.
వేగంగా గమ్యస్థలానికి చేరుకోవాలన్న తపనతో ఆత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేగంగా వెళుతున్న వాహనాలు ఆదుపుతప్పటం. ఎదురుగా వస్తున్న వెళుతున్న వాహనాలపై దుసూ కు వెళ్లటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. . జాతీయ రహదారిని ఆ రు లైన్ల విస్తరణ సందర్బంగా సరైన ప్రమాణాలు, చిహ్నాలు ఏర్పాటు చేయకపోవటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి.
విశ్రాంతి లేక..... జాతీయ రహదారి వెంబడి వెలిసిన పలు డాబా హోటళ్లలో 24 గంటలు మద్యం సరఫరా జరగటం, దూర ప్రయాణాలు చేసే లారీ డ్రైవర్లు విశ్రాంతి లేకుండా వాహనాలు నడపటం లాంటి ఘటనలు ప్రమాదాలకు మూల కారణాలుగా నిలుస్తున్నాయి. గతంలో దూరప్రాంతాలకు వెళ్లే లారీ డ్రైవర్లు కోసం విశ్రాంతి అవసరమని, ఇందుకోసం చర్యలు చేప ట్టాలని ప్రతి పాదనలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో పాటు జాతీయ రహదారిపై వాహనాలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయటం వలన కూడా ప్రమాదాలు రెట్టింపు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకరుగుతున్న ప్రమాదాల ను దృష్టిలో ఉంచుకౌని డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, వారిలో చైతన్యం కలిగించటానికి అధికారులు నిరంతర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post A Comment:
0 comments: