ఐదేళ్ల మున్సిపాల్ పాలన ముగిసింది. ఇప్పటి వరకు ఉన్న ప్రజా ప్రతినిధుల పాలన కాస్తా అధికారులకు వశమైంది. ఐదేళ్ల మున్సిపాల్ సమావేశాల్లో ఒక్కసారి కూడా ఎజెండాపై నిర్మాణాత్మక చర్చ జరిగిందీలేదు. కోట్లాది రూపాయాల పనులు ఎలా జరుగుతున్నాయి... ప్రజా ధనం ఎలా దుర్వినియోగం అవుతుంది అన్న అంశాలపై అనేక మంది కౌన్సిలర్లకు కనీస అవగాహన కూడా ఐదేళ్లు గడిచిపోయాయి.
ఇదిలా ఉంటే చివరి సమావేశంలో టీడీపీ తరుపున గెలుపొందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి మున్సిపాలిటి పరిధిలో జరిగిన అభివృద్ది పనుల్లో రూ. 10 కోట్ల మేర అవినీతి జరిగిందని బాంబు పేల్చారు. దీంతో ఈ విషయం టీడీపీలోనూ, పట్టణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని కూడా ఎమ్మెల్యే విడదల రజని సమక్షంలో కోరారు. అయితే ఈ సందర్బంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి, అవినీతిని నిరూధించే ప్రధమ పౌరురాలుగా ఉన్న ఛైర్‌పర్సన్ చివరి సమావేశంలో అవినీతిపై ప్రశ్నించటం విశేషం. ఈ అంశంపై ప్రజలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందువల్ల మున్సిపాలిటిలో ఐదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమార్కుల దోపిడికి చెక్ పడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత ఐదు సంవత్సరాలుగా వైసీసీకి చెందిన విపక్ష కౌన్సిలర్లు అవినీతి జరుగుతుందని ప్రతి సమావేశంలోనూ ప్రశ్నిస్తున్నా అప్పుడే ఎందుకు స్పందించలేదు..?
గతంలోనే అవినీతిపై విచారణకు ఆదేశిస్తే కోట్లాది రూపాయాల ప్రజాధనం కాపాడే అవకాశం ఉంటుంది కదా..అప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదు..?ఐదేళ్ల కాలంలో పలు సందర్బాలలో ఛైర్‌పర్సన్ రాపిటికేషన్ పేరుతో కోట్లాది రూపాయలు నామినేషన్ పనులు కొనసాగాయి. అప్పట్లోనే రాపిటికేషన్ పనులపై సంతకాలు పెట్టకుండా ఉంటే అవినీతి నిరూధించబడేది కదా.. ఎందుకు చేయలేదు.
మున్సిపాలిటిలో జరిగిన అక్రమాలు, అవినీతి పై ఛైర్‌పర్సన్ పూర్తి వివరాలు వెల్లడిస్తే ప్రజాధనాన్ని అక్రమార్కుల నుంచి ప్రజాధనాన్ని వసూలు చేసి కొత్త సాంప్రదాయానికి తెరతీయవచ్చు.


Post A Comment:
0 comments: