కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చిలకలూరిపేట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విడదల రజని ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు గడిచిపోయింది. నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వచ్చిన అధికారులు అంతా బదిలీపై వెళ్లిపోగా కొత్త అధికారులు విధులు స్వీకరించారు. పాత నీరు వెళ్లిపోయింది. కొత్త నీరు వచ్చింది. కొత్త అధికారులతో, ఎమ్మెల్యే రజని తన మార్కు పాలన అందించనున్నారా..? అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..? అధికారుల తీరులో గతానికి భిన్నంగా మార్పు కనిపిస్తుందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నియోజకవర్గ ప్రజల్లో మెదులు తున్నాయి.
నియోజకవర్గంలోని ఇప్పటి వరకు అనేక శాఖల అధికారుల్లో జవాబుదారితనం కొరవడింది. ప్రజల కోసం పనిచేయాలన్న కనీస ఇంగిత జ్ఞానం మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. కొన్ని కార్యాలయాల్లో అయితే ప్రతిపనికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేసేవారు.విద్యార్దులకు అవసరమైన ధృవీకరణ పత్రాల నుంచి రైతులకు అవసరమైన ప్రతి చిన్న పనికి తాహశీల్ధార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించేవారు. డబ్బులు చేతిలో పడందే మీ-సేవాలో దరఖాస్తు చేసిన ధృవీకరణ పత్రాలు చేతికి అందివికావు. ఇదేక్కొక్కటే కాదు అత్యధిక ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలు మారాయి. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారులు అప్పటి అధికార పార్టీ నేతలకు విధేయులుగా ఉంటే చాలనుకునేవారు. కాని వైసీసీ ప్రభుత్వ ఏర్పటయ్యాక సీఎం జగన్‌మోహనరెడ్డి ముందుగా అవినీతిపైనే దృష్టి కేంద్రికరించటం, సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించటంతో కదలిక మొదలైంది. పాత అధికారులు అంతా మారిపోవటం, స్థానిక, రాష్ట్ర ప్రభుత్వ విజన్ తగ్గట్లుగా నడుచుకోవల్స రావటంతో గతం కన్నా మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు తాత్కలికమా...శాశ్వతమా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
ఎమ్మల్యేగా విడదల రజని గెలుపొందాక అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి మరి అవినీతిని లేని పారదర్శక పాలన అందించటానికి సహకరించాలని కోరారు. తాను తప్ప మధ్యవర్తుల లావాదేవిలకు తలొగ్గవద్దని ఆదేశించటం విశేషం.దీన్ని భవిష్యత్‌లో మధ్యవర్తులు లేని పారదర్శక పాలనకు తెరతీసారని చెప్పవచ్చు. పట్టణంలో మంచినీటి సమస్యలపై స్పందించి అధికారులతో సమావేశం నిర్వహించి, పరిష్కారమార్గాలు అన్వేషించారు. నియోజకవర్గంలో అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. వీటి అమలులో అధికారులే కీలకం. మంచి చేయాలన్న సంకల్పం, ఇందుకు అధికారుల మద్దుతు ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఎమ్మెల్యే రజని పాలన ఎలా ఉండబోతుందన్న విషయం రానున్న రోజుల్లోనే తేలనుంది.



Post A Comment:
0 comments: