కొన్ని జ్ఞాపకాలు చెరిగిపోవు. అవి మనల్ని వెంటాడుతునే ఉంటాయి. మనిషి భౌతికంగా దూరమైన ఆయన చేసిన మంచి పనులు ఆయన్ని ప్రజల గుండెల్లో దేవుడ్ని చేస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. చిలకలూరిపేట నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో కొనసాగిన అభివృద్ది ఫలాలు, సంక్షేమం చిరస్మరనీయం. చిలకలూరిపేట నియోజకవవర్గంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అవినాభావ సంబంధం ఉంది. స్వర్గీయ సోమేపల్లి సాంబయ్యతో కొనసాగిన మితృత్వం అనంతరం ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రిరాజశేఖర్‌తో కొనసాగాయి. డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా, మర్రిరాజశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవవర్గంలో జరిగిన అభివృద్ధి ఒక చరిత్ర. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా పేట అభివృద్దిని ఒక్కసారి స్మరించుకుందాం.
మానుకొండవారిపాలెం, యడవల్లి, బొప్పూడి, గణపవరం, గోపాళంవారిపాలెం, తూబాడు గ్రామాలల్లో ఎత్తిపోతల పథకాలకు నిధులును విడుదలచేశారు.
నియోజకవర్గంలో అత్యధికంగా పత్తి, పొగాకు సాగుచేస్తున్నందున పూర్వకాలం సాగర్ కాల్వల పొడిగింపు జరగలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టు చివరి ప్రాంతమైన చిలకలూరిపేటకు సాగర్ కాల్వల పొడిగింపు చేయాలని రైతుల ఆకాంక్ష. దీని మేరకు సాగర్ కాలువల పొడిగింపు సర్వేకు మైస్ నిధులు విడుదల చేశారు.
వైఎస్ఆర్ హయాంలో జరిగిన రుణమాఫీలో నియోజకవర్గంలో 30వేల మంది రైతులు లబ్దిపొందారు.
పట్టణంలో అర్హులైన నిరుపేదలకు నివేశనా స్థలాలకు అవసరమైన 52 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసారు.
సాగర్ కాలుపు ఆదునికీకరణ పనుల్లో నియోజకవర్గ పరిధిలో 41 కోట్ల రూపాయలను కేటాయించారు.
పట్టణంలో పేదలు నివసించే మురికివాడల అభివద్ధి కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు వైఎస్ రాజశేఖరరెడ్డి 16.74 కోట్ల నిధులు మంజూరు చేశారు. అభివద్ధి పనుల్లో భాగంగా ఈ పథకం ద్వారా సీసీరోడ్లు, డ్రైన్లు, విద్యుద్దీకరణ పనులతో పాటుగా ఐదు కమ్యునిటీ భవనాలు నిర్మించారు.
రూ. 100 కోట్ల వ్యయంతో యడ్లపాడు మండలంలోని మైదవోలు- వంకాయలపాడు పంచాయతీల పరిధిలో స్పైసెస్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
మూడు మండలాల పరిధిలో రూ. 54 కోట్ల వ్యయంతో 21 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు.
రూ. 10లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయానికి నిధులు మంజూరుచేశారు.
చారిత్రక ప్రదేశమైన కొండవీడు కోట అభివద్ధి పరిచేందుకు ఘాట్ రోడ్డు ఏర్పాటు రూ. ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారు.
. వైఎస్ఆర్ నగరబాట పర్యటనలో భాగంగా చిలకలూరిపేటకు వచ్చినప్పుడు రూత్ డైమెన్ నగర్ కాలనీ స్వరూపాన్ని మార్చడానికి కోటిరూపాయల నిధులు విడుదల చేశారు.
పట్టణంలోని గడియారసంబం పునరిమాణానికి రూ.10 లక్షల మున్సిపల్ నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేశారు. చిలకలూరిపేట మండలంలోని పోతవరం గ్రామంలో కస్తూరిభా గాంధీ బాలిక పాఠశాల ప్రారంభించారు.
చిలకలూరిపేటకు ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యగా ఉన్న పసుమర్రు , అమీన్ సాహెబ్‌పాలెం బ్రడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.


Post A Comment:
0 comments: