ఈ ఎన్నికల్లో గెలుపు సరే.. అభ్యర్దుల ఎంపికే కీలకం..
స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక్క క్షణం వృధా అయినా దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఒకే సారి ఎన్నికలు రావటంతో అంతా హడావిడి నెలకొని ఉంది. అధికార వైసీసీ, ప్రతిపక్ష టీడీపీ కూడా సరైన అభ్యర్దుల ను ఎంపిక చేయటానికి కసరత్తు చేస్తున్నాయి.
ఎన్నికలకు ముందు ఆయా రాజకీయపార్టీలు అనుసరించాల్సిన వ్యూహం పైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఆయా రాజకీయపార్టీలు ఓటర్ను పోలింగ్ బూత్‌వరకు తీసుకువెళ్లి తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయించుకోవటం పైనే పోల్ మేనేజ్‌మెంట్ అంటారు. గెలుపుకోసం ముందస్తుగా తీసుకొనే నిర్ణయాలు భవిష్యత్తు ఫలితాలపై ఉంటుంది. ఇదే అంశంపై ఇప్పుడు ఇరుపార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
అన్నింటి కన్నా ముఖ్యంగా స్థానిక సంస్థల్లో పార్టీ కన్నా వ్యక్తులకే ఎక్కువ విలువ ఉంటుంది. అటువంటి వ్యక్తులనే ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులు తమ పార్టీ తరుపునే పోటీ చేస్తే విజయం సాధ్యమౌతుందని నమ్ముతున్న పార్టీలు అటువంటి వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మెజార్టీ అభిప్రాయం మేరకు జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం పోటీల ఉంటే అభ్యర్థి వ్యక్తిగత బలం, పార్టీ బలం, ఆర్థికస్థోమత వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు కరసత్తు చేస్తున్నారు.


Post A Comment:
0 comments: