ష్....అంతా గప్ చిప్... మున్సిపల్ ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించే సమయంలో రహస్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కీలకమైన వార్డుల్లో ఏ సామాజిక వర్గానికి ప్రాధన్యత ఇస్తున్నారు... పోటీ చేసే వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్న విషయంపై దృష్టి సారించారు. ఎవరికివారు ప్రత్యర్థి పార్టీపై దృష్టి సారించటంతో అభ్యర్థుల ప్రకటన తీవ్ర ఉత్కంఠ రేపుతుంది.
38 వార్డులకు సంబంధించి ప్రధాన పార్టీలు సమావేశాలు చేస్తున్నాయి. ఆయా వార్డుల పరిధిలో ఒక్కొక్క వార్డునుంచి ఇరువురు, లేదా ముగ్గురు అభ్యర్థులను ఎంపికచేసి వారిలో ప్రత్యర్థిపార్టీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బి-ఫారం కేటాయిస్తుందో అని వేచిచూసే దోరణి వ్యక్తం అవుతుంది. అయితే కొంత మంది సీనియర్లకు ముందుగానే ఆయా పార్టీలు హామీలు ఇవ్వటంతో కొన్ని వార్డుల పరిధిలో నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. ఎస్టీ,.ఎస్పీలకు రిజర్వులయిన వారులో రెండు ప్రధాన పార్టీలలో ఏకప్రాయం వ్యక్తం అయినా, మిగిలిన బీసీ, మహిళ, జనరల్ వార్డులో మాత్రం అభ్యర్థుల ఖారారు. తుదిదశకు రాలేదు. పార్టీల నిర్ణయం ఏదైనా , చివరి దశలో ఇబ్బందులు పడటం కన్నా ఎందుకైనా మంచిదని బరిలో ఉండబోయే అభ్యర్థులు న్యాయవాదుల ద్వారా నామినేషన్లు నింపే పనిలో పడ్డారు.
చైర్మన్ అభ్యర్ది పైనే అందరి దృష్టి.....
ప్రస్తుతం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైపర్సన్ అభ్యర్థి ఎంపికపైనే ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈసారి ఓసీ జనరల్‌కు కేటాయించటంతో ఏ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అంశంపై గత కొన్ని రోజులు చర్చలు కొనసాగుతున్నాయి. చైర్మన్ ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు కాబట్టి చైర్మన్ అభ్యర్ది కూడా కౌన్సిలర్ గా గెలుపొందాలి. ఆయా వార్డుల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ కూడా విజయం సాధించాలి. ఆయా పార్టీలు ఛైర్మన్ అభ్యర్దిని ఎంపిక చేసినా చివరిదాక గోప్యంగా ఉంచే అవకాశం ఉంది.


Post A Comment:
0 comments: