మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో పట్టణంలో హాడావిడి మొదలైంది. పట్టణంలోని 38వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు గత కులాలు, వర్గాల ప్రాతిపదికన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఈ సారి ఓసీ జనరల్‌కు కేటాయించటంతో పోటీ తీవ్రంగా నే ఉంది.
ప్రతి చోట ఎన్నికల చర్చలే కొనసాగుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే పెద్ద మనుషులు, ఆయా సామాజిక వర్గాల పెద్దలకు ప్రాధాన్యత పెరిగింది. నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండటంతో రాజకీయ పార్టీలు ప్రతి క్షణాన్ని ఆత్యంత విలువైందిగా భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యుల వ్యక్తిత్వం కీలకంగా భావిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిల్లోనూ నామినేషన్ తేదీకి ముందే అభ్యర్థులను ఖారారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతర్ధి పార్టీల అభ్యుర్థుల కదలికపై ఆరా తీస్తున్నారు. ఆశావాహులు ఎవరిని కలుస్తున్నారు?, ఏఏ హామీలు ఇస్తున్నారు? , వ్యూహం, ఎత్తుగడ తదితర అంశాలను ఎప్పటికప్పుడు చేరవేయటానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్టీలోనే ఉంటూ కోవర్టుల్లా వ్యవహరిస్తున్న వ్యక్తుల కదలికలు ఆన్నీ పార్టీల నాయకులల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.


Post A Comment:
0 comments: