ఎన్నికలు అంటేనే డబ్బుతో మొదలై డబ్బుతో ముగిస్తాయి. డబ్బుల ప్రభావంలేని ఎన్నికలు అని చెప్పుకున్నా నోట్ల కట్టలు తెగక తప్పటం లేదు. చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలోనే కొంతమంది అభ్యర్థులకు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. పలు వార్డుల్లో ఇప్పటికే డబ్బు ప్రభావం కనబడతుంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఖర్చులు పెరగటంలో అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంటుంది. అనుకున్న ఖర్చు కన్నా రెండీంటలు పెరగటంలో ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
శుక్రవారం నామినేషన్ వేసిన ఓ పార్టీకి చెందిన అభ్యర్థి జనం కోసం, వారికి మద్యం కోసం మొత్తం ఖర్చు వేలల్లో అవుతుంది అని అంచనా వేసుకుంటే లక్షకు చేరిందట. దీంతో అతను ఒక్కరోజే ఇంత ఖర్చు అయితే ఎన్నికల సమయానికి ఎంత ఖర్చు అవుతుందో నని మల్లగుల్లాలు పడుతున్నాడు.
బంధువులు, మిత్రుల బలవంతంపై బరిలో దిగిన ఓ పార్టీకిచెందిన సీనియర్ నాయకుడు నామినేషన్ వేశాడు. అయితే ఎన్నికలకు సంబంధించి తన నుంచి ఏం ఆశించవద్దని అధినాయకుడు తేల్చిచెప్పటంతో ముందుకు ఎలా వెళ్లాల్లో తెలియక మదన పడుతున్నాడు.
భవిష్యత్ లో జరిగే అభివృద్ధి పనులపై నాయకులు ఇచ్చే హామిలను ప్రజలు నమ్మటం లేదు. దీంతో పెద్ద మనుషుల ఒప్పందాలు, కాగితాలపై హామిల నేరవేర్చే విధానం, ఆ ప్రాంతాల అభివృద్ధికి ముందుగానే మద్యవర్తి పేరుతో నగదు డిపాజిట్ చేయటం కొనసాగుతున్నాయి.
ఒకవార్డులో తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఓ సామాజిక వర్గ ప్రజల కోసం ముందుగానే వారు కోరిన విధంగా చేస్తానని ముందుకు వచ్చిన నాయకుడి అభ్యర్ధనను ప్రత్యర్ధి పార్టీ తిరస్కరించింది. ఆ పార్టీ తరుపున బరిలో దింపటంతో ఏకగ్రీవ ప్రయత్నాలు సఫలంకాలేదు.
మరోవైపు ఎన్నికల సమయానికి అవసరమైన మద్యం సరఫరా చేయకపోతే గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీల నాయకులు పట్టణంలో ఉన్న మద్యం వ్యాపారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటాన్నారు. తమకు అవసరమైన బ్రాండ్లు, బయటి మార్కెట్ కన్నా తగ్గించి బేరాలు కుదిర్చుకుంటున్నారు. అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని ముందుగానే మద్యం కేసులు కొనుగోలు చేసి రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికలలో మద్యం లేనిదే రాజకీయాలు ముందుకు కదలటం లేదని పలువురు ఆశావాహులు వాపోతున్నారు.
ఉదయం టీ ఫై నుంచి రాత్రి భోజనం మనకు పలువురు నిరుద్యోగులకు, కూలీలకు ఎన్నికలు ఆదాయమార్గంగా మారాయి. చదువుకున్న నిరుద్యోగ యువకులను ఆయా వారుల్లో పార్టీ అభ్యర్థులు కులాల వారి సర్వే నిర్వహిస్తున్నారు. ఏఏ వారానికి చెందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. వారు ఏపార్టీవైపుమొగ్గుచుపుతారు తదితర వివరాలను సేకరించే పని వారికి కేటాయించారు.
వారుల్లో ప్రచారం నిర్వహించే సమయంలో జెండాలు మోయటానికి, జైజై నినాదా చాలు ఇవ్వటానికి ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వీరిలో పాటు ఆయా వారులకు ముఖ్యులు సమాలోచనలు, సమావేశాలకు మరికొంత మంది వస్తుంటారు. వీరందరికీ ఉదయం టిఫెను. మధ్యాహ్న.రాత్రి బో జరాలుకు పట్టణంలోని కొన్ని హోటల్లో ఒప్పందం కుదిర్చుకున్నారు. వారికి కొన్ని భోజన టికెట్లు కేటాయించటంలో హోటళ్లు కీటకట లాడుతున్నాయి. రాత్రి సమయంలో అభ్యర్థులకు ఖర్చు మరింతగా పెరుగుతుంది. సాదరఖర్చులలో పాటు మద్యం లేకుండా.. కదలని పరిస్థితి నెలకొంది. ఇవండి అభ్యర్దుల కష్టాలు.

Post A Comment:
0 comments: