ఎన్నికల ప్రచారం ఆధునిక సంతరించుకుంది. గత ఎన్నికలలోనే ఓటర్ల సెల్ నంబర్లు సేకరించి అధినాయకులు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి ఓట్లు అభ్యర్థించేవారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం సెల్ ఫోన్ లేని వ్యక్తులు లేరనే చెప్పవచ్చు. ఈ క్రమంలో వీటి ప్రాధ్యాన్యత గుర్తించిన రాజకీయపార్టీలు ఆయా వార్డులో ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగినా, ప్రచార ఘట్టం ముగిసినా, పోలింగ్ రోజు వరకు ఆయా ఓటర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించటానికి సెల్ ఒక ప్రచార అస్త్రంగా మారింది. ఇప్పటికే కొన్ని పార్టీలు సెల్ ఫోన్ నంబర్లను సేకరించే పనిలో పడ్డాయి.
ఫేస్ బుక్ ద్వారా అభ్యర్థనలు.......
సోషల్ మీడియాను కూడా ప్రచార అస్త్రం వినియోగించుకోవాటానికి రంగం సిద్ధమైంది. ఒక్క చిలకలూరిపేట పట్టణంలోని ఫేసు బుక్‌లో నమోదైన వ్యక్తుల సంఖ్య సుమారు 20 వేలు దాటింది. ఫేస్ బుక్ వినియోగించే వారు అత్యధికులు విద్యావంతులు, యువత కావటంతో వారికి అనుగుణంగా అభ్యర్థులు పోస్టు చేయటానికి ఆయా పార్టీలు కొంతమంది వ్యక్తులను నియమించింది. ఇతర దేశాలలో పట్టణ వాసులు కూడా స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆసక్తి కనపరుస్తున్నారు. ఫేస్ బుక్ లో ప్రచారం 10 శాతం విజయవంతమవుతుందని ఆయా పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

Post A Comment:
0 comments: