ఏ రాజకీయ పార్టీ బందుకు పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసంచారం నిలిచిపోయింది.దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, చికిన్ దుకాణాలు మూతపడ్డాయి. కరోనా నియంత్రణలో భాగంగా చిలకలూరిపేట అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ముందస్తు చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు. కొంతమందికి ఇబ్బంది ఉన్నా అత్యధిక మంది ప్రజల ఆరోగ్యం కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
నిరోధానికి చర్యలు తప్పవు...
గుంటూరు లాంటి మహానగరంలో కూడా లేని విధంగా దుకాణాలు మూసివేయటం, కరోనా ప్రచారం, అవగాహన కల్పించటం విశేషం. ఇందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు. గుంటూరులో బైపాస్ ఉంది. నరసరావుపేటలో బైపాస్ ఉంది. ప్రకాశం జిల్లా మార్టూరు లో కూడా వాహనం పట్టణంలోకి ప్రవేశించకుండా నేరుగా వెళ్లే పోయే అవకాశం ఉంది. కాని చిలకలూరిపేటలో ఇటువంటి పరిస్థతి లేదు. నేరుగా నియోజకవర్గంలోని బోయపాలెం, యడ్లపాడు, చిలకలూరిపేట పట్టణం,తాతపూడి వరకు జాతీయ రహదారి కొనసాగుతుంది. దూర ప్రాంతాలకు చెందిన వారు తమ అవసరాల కోసం కొంతసేపు ఇక్కడే స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని నిరోధించగలిగితే కొంతమేర ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అధికారులు ఈ దిశగానే అడుగులు వేశారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చి చేరిన వారి సంఖ్య 18కి చేరింది. వీరంతా అరోగ్యంగా ఉన్నా వీరిని ఇంటికే పరిమితం చేయటంతో పాటు, ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.దీంతోపాటు 30 పడకల ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డు కేటాయించి, ముందుగా నాలుగు పడకలు కేటాయించారు. అధికారులతో పాటు స్వచ్చంధసంస్థలు కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి. చిలకలూరిపేటకు చెందిన ప్రముఖులు ఆరా మస్తాన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో మైక్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. పోలీసు, వైద్య ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి డాక్టర్ గోపినాయక్ చెబుతున్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. సమూహాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కళ్లు, ముక్కు, నోటిని టచ్ చేయడం విరమించాలి దగ్గు, తుమ్ములు వస్తే ముక్కు, నోటికి చేతులు అడ్డుపెట్టుకోవాలి జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. మాస్క్‌ను ధరించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు



Post A Comment:
0 comments: