తొలి చైర్మన్ గా శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు , అనంతరం పదివి చేపట్టిన బచ్చురామలింగం పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లు బీటీరోడ్లుగా ఏర్పాటయ్యాయి. బీసీ హెచ్ స్వామినాయక్ పట్టణ ప్రజలకు రక్షిత మంచినీటి పధకం ప్రారంభమైంది. 1979వ సంవత్సరంలో 80 ఎకరాల విస్తీర్ణంలో పాత చెరువు నిర్మాణం కొనసాగించి ఆయన హయంలోనే ప్రజలకు కుళాయిలకు మంచినీరు అందించే ప్రక్రియ ప్రారంభమైంది.
అనంతరం చైర్మన్ పదవి చేపట్టిన ఉసరి నాగయ్య హాయంలో వీధి దీపాలు, రోడ్లకు ప్రాధ్యాన్యత నిచ్చారు. మాజేటి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా కొనసాగిన సమయంలో ఒకటవ వార్డులో మున్సిపల్ పాఠశాల ఏర్పాటైంది. ఇదే వార్డులో ఉన్న రిజర్వుడ్ స్థలానికి పార్కుగా అభివృద్ధి చేయటానికి ప్రహరిగోడ ఏర్పాటు చేశారు. పండరీపురం బీఆర్ మున్సిపల్ పాఠశాలను హైస్కూల్ గా రూపొందించారు. పలుకాలనీలలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటైంది.
తవ్వా విజయలక్ష్మీ మహిళ చైర్ పర్సన్ గా పనిచేసిన కాలంలో రెండవ మంచినీటి చెరువు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఏఎంజీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ డేవిడ్ జర్మనీ దేశస్తుడు డైర్మెన్ అందించిన మూడు కోట్ల నిధులతో పైపులైన్ వ్యవస్థ విసృతమైంది. పలు ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంకర్ల నిర్మాణం జరిగింది.
అనంతరం చైర్మన్ గా పనిచేసిన బింగి రాముర్తి హాయంలో ఎన్‌టీఆర్ కాలనీలో బింగిరామూర్తి పార్కు అభివృద్ధి జరిగింది. గాంధీ పార్కు స్థలంలో మున్సిపల్ బిల్డింగ్స్ నిర్మాణం చేశారు. 2010 సెప్టెంబర్ వరకు జరపల కోటేశ్వరి చైర్ పర్సన్ గా వ్యవహరించిన హాయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజురు చేసిన మూడు కోట్ల వ్యయంతో నూతన మున్సిపల్ బిల్డింగ్ ఏర్పాటైంది. కౌన్సిల్ సమావేశాలకు ప్రత్యేక సమావేశగదిని ఏర్పాటు చేశారు.
గంజి చెంచుకుమారి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన కాలంలో మున్సిపల్ కౌన్సిల్ హాలును ఆధునికరించారు. పట్టణంలో స్వచ్చభారత్ కింద వేలాది వ్యక్తి, సాముహిక మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగింది. అమృత్ పథకం ద్వారా ఓవర్‌ట్యాంక్‌ల నిర్మాణం కొనసాగింది.

Post A Comment:
0 comments: