.పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కోసం మున్సిపల్ ఉన్నతాధికారులు గతంలో ఉన్న చట్టానికి సవరణలు చేసిన ఘటన ఇది. 2005 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలో 19 వ వార్డుకు దివ్వెల వెంకటరత్నం పోటీ చేసి గెలుపొందాడు. ఎన్నికల సమయంలో ముగ్గురు సంతానం పోటీకి ప్రతిబంధంగా నిలచింది. 1985 మున్సిపల్ చట్టం ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే వారు ఎన్నికల్లో పోటీ కి అనర్హులు. వెంకటరత్నానికి 2003 ఒక కుమారుడు, 2004 సంవత్సరంలో ఇరువురు కవల పిల్లలు జన్మించారు. దీంతో పోటీకి అతడు అనర్హుడుగా స్థానిక మున్సిపల్ అధికారులు ప్రకటించారు. దీంతో ఇతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు తీర్పు మేరకు మున్సిపల్ ఉన్నతాధికారులు 2005 సెప్టెంబర్ 8 తేదీన జీవో ఎంఎస్ నంబర్ 195 ను జారీ చేశారు. దీని ప్రకారం ఉన్న సవరణలు చేసి రెండో కాన్సులో ఇరువురు కవలలు ఉంటే పోటీకి అర్హులుగా ప్రకటించారు.
Home
చరిత్ర
నేటి రాజకీయాలు
నేటి వార్తలు
కవలలు ఉంటే పోటీకి అర్హులే..చట్ట సవరణ కోసం పట్టణ వాసి న్యాయ పోరాటం
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: