కరోనా పై చిలకలూరిపేట నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అధికారులు, ప్రజా ప్రతినిధుల చొరవతో తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజల్లోనూ గతం కన్నా మిన్నగా అవగాహన పెరిగింది. లాక్‌డౌన్ విషయంలోనూ ప్రజలు స్వచ్చంధంగా పాటిస్తున్నారు. . మనిషి ఆరోగ్యంగా మిగిలితే చాలు, మరోకరికి తన వ్యాధిని అంటించకుండా ఉంటే చాలు. నిర్ణయం మంచిదే. డబ్బులు ఉన్నవాళ్లు రోజుల తరబడి నిత్యాసరాలను నిల్వ చేసుకుంటున్నారు. మరి లేని వారి పరిస్థితి ప్రతి రోజు యుద్దంలా మారింది.
కాని ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ లాక్‌డౌన్ వల్ల పేదల పరిస్థితి, రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. రోజంతా కష్టపడినా ఆ రోజు జీవితానికే సరిపడిన వస్తువులను మాత్రమే సమకూర్చుకొనే వారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ రోజు ఎలా గడుస్తుందో అన్న దిగులుతో ఏ రోజుకు ఆరోజు సతమతమౌతున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో అనేక మంది పేదలు కూలీ పనులు చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయకూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా కంపెనీలలో దినసరి కూలీలుగా, ముఠాకూలీలుగా, చిన్న చిన్న కార్ఖానలు, దుకాణాలలో గుమాస్తాలుగా జీవిస్తున్నారు. వీరు లాక్‌డౌన్ వల్ల పనికోల్పాయారు. పనిలేక ఇంట్లో వండుకోవటానికి నిత్యవసర వస్తువులు లేక పస్తులు ఉండాల్సిన స్థితి ఏర్పాడింది. అప్పు ఇచ్చే నాధుడు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఆటోలపై ఆధారపడి జీవించే వారు, మెకానిక్‌లు పొట్టపోసుకొనే వారు జీవనం కోల్పోయారు. వీరిని నమ్ముకొన్న కుటుంబాలకు న్యాయం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
వీరు బతకటమే ఇబ్బందిగా ఉంటే.. మరోవైపు తమ రోజువారి అవసరాల కోసం ఫైనాన్సులు, వడ్డీలు తీసుకొన్నవారు, ప్రైవేటు సంస్థల వద్ద వాయిదాలపై చెల్లించే విధంగా గృహపయోగ వస్తువులు కొనుగోలు చేసినవారికి ఒకటో తారికు వస్తుందంటే గుండెళ్లో రైళ్లు పరిగెత్తున్నాయి. వీరి బారి నుంచి గట్టించటానికి ప్రభుత్వ పరమైన నిర్ణయం తీసుకోవాలి.
మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రభుత్వ అదేశాలను మరోలా అర్ధం చేసుకుంటున్నారు. నిర్ణిత సమయం వరకు కిరాణా దుకాణాలకు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినా వాటిని మూయించి వేయటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యం కోసం చేపట్టిన లాక్‌డౌన్‌తో కొన్ని ఇబ్బందులు ఉన్నా తప్పని సరిగా పాటించాల్సిందే. ఈ దిశగా చర్యలు తీసుకోవల్సిందే. పేదల పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.



Post A Comment:
0 comments: