అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా మారింది చిలకలూరిపేట సోషల్ మీడియా పరిస్థితి. నియోజకవర్గంలో సోషల్మీడియా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అంటే కరోనా వ్యాధి విజృబిస్తున్న సమయంలో యాక్టివ్గా ఉంది. ప్రజలకు సరైన సమాచారం అందించటంలో ముందుంజలోనే ఉంది. కాని కొంతమంది సోషల్ మీడియా వేదికగా సృష్టిస్తున్న గందరగోళం ఇటు ప్రజలను అటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తునే ఉంది. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న వారు ఎక్కవ సేపు సోషల్మీడియాలో మునిగితేలుతున్నారు.
ఫలానా డాక్టరుకు కరోనా సోకిందంటా... ఫలానా వారికి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయంటా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు ప్రజలు భయభ్రాంతుకు గురి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే ఫలానా విధంగా చేస్తే కరోనా రాదు. ఇలాంటి వాటితో కూడా ప్రజలు గందరగోళానికి గురౌతున్నారు. కొంతమంది దీన్ని అనుసరించి లేనిపోని అనర్దాలు కొని తెచ్చుకుంటున్నారు. సోషల్ ప్రభావం ఎంత బలంగా ఉందంటే చికెన్ తింటే కరోనా వస్తుందని చేసిన ప్రచారం ఇప్పుడు ఆ పరిశ్రమపై ఆధారపడ్డవారిని రోడ్డున పడేలా చేసింది.
ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కరోనాకు సంబందించిన సమస్త సమాచారం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మెడికల్ నివేదకలను అందిస్తున్నారు. తీసుకోవల్సిన జాగ్రత్తలను నిపుణులతో అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరమైన ప్రకటనలు మాత్రమే నమ్మండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎప్పుడు చూసి ఉండం. ఇంతవరకు మందుగాని, సరైన వాక్సిన్ గాని లేదు. అన్ని ప్రయోగదశలోనే ఉన్నాయి. ఇది గమనించకుండా సోషల్ మీడియాలో త్రోల్ అవుతున్న ప్రచారాలను గుడ్డిగా నమ్మటం,
వాటిని షేర్ చేయటం చేయకండి. ఇలాంటి పుకార్లను వ్యాప్తిచేసేవారిపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది.
ఏవరో చేసిన తప్పులో మీరు భాగస్వామి కాకండి. లేనిపోని కేసులు కొనితెచ్చుకోకండి. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. ఈ వ్యాధి మనకు సోకదని ధీమా వదలండి.
సోషల్మీడియాలో తప్పదు ప్రచారాలను నమ్మకండి.
అందరి సహకారంతోనే ఈ వ్యాధిని నిర్మూలించటం సాధ్యమౌతుంది. మన చిలకలూరిపేటలో ఏ ఒక్క కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడదాం.
అందరికి స్పూర్తిగా నిలుద్దాం.



Post A Comment:
0 comments: