.
ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు అంటూ గత వైభవాన్ని గుర్తు చేసుకుంటాడు మహాకవి శ్రీశ్రీ. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాల్సిందే.నేడు శ్రీరామనవమి. అన్ని పండుగలపై పడట్టే కరోనా ఎఫెక్ట్ శ్రీరామనవమిపై కూడా పడింది. ఇటీవలే ఉగాది పండుగ వెళ్లిపోయింది. రానున్న క్రైస్తవుల పండుగులు గుడ్ ప్రైడే, ఈస్టర్ పండుగలపై కూడా కరోనా లాక్‌డౌన్ ప్రభావం పడనుంది.
చిలకలూరిపేట శ్రీరామనవమి ఉత్సహాలకు పెట్టింది పేరు. చలవ మందిళ్లు వేసి దశాబ్దాలుగా ఆ పండుగ సాంప్రదాయాన్ని నేటి తరం కొనసాగిస్తుంటారు . ప్రస్తుతం కరోనా ఎఫ్టెక్ట్‌తో ఈ ఏడాది ఉత్సహాలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాల కన్నా చిలకలూరిపేటలో నిర్వహించే ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ, వివిధ అలంకణలతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు పండుగ శోభను సంతరించుకుంటాయి. వేద మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించే తీరు భక్తులకు కన్నుల పండువగా ఉండేది. పండుగకు ముందే కోలాహలం కనిపించేది. చలవ పందిళ్లను వేయటానికి, వివిధ అలంకరణలు చేయటానికి ప్రత్యేక పనివారు కష్టపడేవారు. ఏ పందిరి వద్ద ఏ ప్రత్యేక ఉందో అని ప్రజలు ఉత్సాహంగా అన్ని పందిళ్లను కులమతాలకు అతీతంగా సందర్శించేవారు. పిల్లలకు అవసరమైన అన్ని రకాల ఆటబొమ్మలు ఇక్కడే లభించేవి. ఇప్పుడు కరోనా దెబ్బతో లాక్‌డౌన్‌తో పందిళ్లు వేసే ప్రాంతాలన్ని నిర్మానుషంగా మారిపోయాయి. ఎటూ చూసినా నిశ్శబ్దవాతావరణం.
ప్రణాలను హరించి వేసే మహమ్మారి పొంచి ఉంది. సామూహికంగా పండుగలు, ఉత్సహాలు జరుపుకొనే సమయం లేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఏ పండుగలైనా ఇంటికే పరిమితమవ్వాలని ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. చిలకలూరిపేట న్యూస్ వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ..


Post A Comment:
0 comments: