కరోనా వైరస్ నానాటికి తన విశ్వరూపం చూపుతోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు లేవని నిర్లక్ష్యం వదలి ఇంటిపట్టునే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిలకలూరిపేట సమీపన ఉన్న నరసరావుపేటలో కరోనా పాజిటివ్ తో వ్యక్తి మృతి చెందటంతో పేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. వ్యాధి సంక్రమించకుండా ఇంటింటి సర్వేలతో అధికార యంత్రాంగం తన పని చేసుకుపోతుంది.
ఈ క్రమంలో జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టటర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. సాధారణ రోజుల్లో నిత్యావసరాలను సమకూర్చుకునేందుకు మినహాయింపునిచ్చే ఉదయం 6 నుంచి 9 గంటల సమయం కూడా ఉండదన్నారు. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. రోజు మార్చి రోజు లాక్‌డౌన్‌ను జిల్లాలో అమలు చేయనున్నామని, ప్రజలు 15 రోజులకు అవసరమైన నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవాలని, ప్రజలు తమవంతు సహకారం అందించాలన్నారు.

Post A Comment:
0 comments: