అవినీతి అధికారుల భరతం పడుతున్న ఎమ్మెల్యే విడదల రజని
పక్కా ఆధారాలు..ఇంకా తడుముకోవటానికి.. తప్పు కోవటానికి ఏ మాత్రం అవకాశం లేదు. తాను తప్పు చేయలేదనటానికి వీలులేదు. ఎవరో చెప్పే గాలి కబూర్లకు ఆమె విలువ ఇవ్వటం లేదు. పార్టీ నాయకులు ఏ అధికారిపైనో చాడీలు చెబితే చర్యలు తీసుకోవటం లేదు. తనకు ఆధారాలు కావాలి. ఆ ఆధారాల ఆధారంగానే అవినీతి అధికారుల భరతం పడుతున్నారు చిలకలూరిపేట ఎమ్మేల్యే విడదల రజని.
చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించాలని ఆమె ఆశిస్తున్నారు. అయితే గతం నుంచి అవినీతిలో మునిగితేలే కొంతమంది అధికారులకు ఎమ్మెల్యే చెప్పినా లైట్ తీసుకున్నారు. తమకు పై స్థాయిలో పలుకుబడి ఉందనో, కులం,మతం పార్టీ ఇలా ఏదో ఒక కారణం చెప్పి బయట పడవచ్చుకున్నారు. కాని వారి ఆటలు సాగలేవ్వలేదు. తప్పు చేస్తే, ఆ తప్పుకు ఆధారం దొరికితే చాలు వారు చిలకలూరిపేట వదలి వెళ్లాల్సిందే.
ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ముందుగా అన్ని శాఖల అధికారులతో తన పాలన ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు. కొంతమంది అప్రమత్తమయ్యారు. మరి కొంతమంది అందరూ చెప్పే తీరు ఇదే అని లైట్ తీసుకున్నారు. ఇక ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో చెప్పి చూసినా వినటం లేదన్న నేరుగా ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పీహెచ్‌సీ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మున్సిపాలిటి తాజాగా ఎక్సైజ్ కార్యాలయం ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను చుట్టేసారు. పరిస్థితి అర్ధమైంది. అధికారుల తీరు ఎలా ఉందో ప్రజలే చెప్పారు.
ఇలా రెండు దశలు ముగిశాక ఎమ్మెల్యే ప్రత్యక్ష కార్యచరణకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రక్షాళన చేశారు. శానిటరి ఇన్సెపెక్టర్‌పై కాల్ రికార్డు వినిపించి మరీ వేటు వేశారు. ఇలా తన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలోనే ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ రామ్‌ప్రసాద్ బెల్టుషాపుల నిర్వాహకులతో మాట్లాడిన కాల్ రికార్డును వినిపించి మరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయటంతో అతని అవినీతి పేటలో ముగిసింది. మొత్తం మీద పేట అవినీతి అధికారులకు ఎమ్మెల్యే విడదల రజని సింహస్వప్నంగా మారారనటంతో అతియోశక్తి లేదు.

Post A Comment:
0 comments: